కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- January 11, 2026
కువైట్ః కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం జనవరి 10న ఎంబసీ ఆడిటోరియంలో విశ్వ హిందీ దివస్ (ప్రపంచ హిందీ దినోత్సవం)ను జరుపుకుంది. ఇందులో 350 మందికి పైగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కువైట్‌లోని 25 భారతీయ CBSE పాఠశాలల నుండి టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. పది లక్షలకు పైగా భారతీయ ప్రవాసులకు నిలయంగా ఉన్న కువైట్‌లో హిందీ మరియు భారతీయ సంస్కృతికి పెరుగుతున్న ప్రజాదరణను ఈ వేడుకలు హైలైట్ చేశాయి.
ప్రపంచ హిందీ దినోత్సవానికి ముందు CBSE స్కూళ్లకు చెందిన విద్యార్థులకు హిందీ పారాయణ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి రేంద్ర మోదీ సందేశాన్ని వినిపించారు. కువైట్‌లోని భారత రాయబారి పరమిత త్రిపాఠి విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు సమాజ సభ్యుల ఉత్సాహంగా పాల్గొన్నందుకు ప్రశంసలు కురిపించారు. హిందీ పారాయణ పోటీ విజేతలకు ఆమె అవార్డులను ప్రదానం చేశారు. హిందీ భాషను ప్రోత్సహించడానికి మరియు దాని సాంస్కృతిక, చారిత్రక ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం జనవరి 10న ప్రపంచ హిందీ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







