విజిటర్స్‌పై హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఫీజు

- July 28, 2016 , by Maagulf
విజిటర్స్‌పై హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఫీజు

కువైట్‌ ప్రభుత్వం, ఎంపీ ఖలీల్‌ అల్‌ సలె సూచించిన 'వలసదారులపై హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌ ఫీజు' ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. విజిట్‌ వీసా మీద వచ్చే వలసదారుల నుండి ఈ ఫీజు ఇకపై ఖచ్చితంగా వూలు చేయనున్నారు. పార్లమెంటరీ సెషన్‌లో ఈ ప్రపోజల్‌కి ఆమోదం లభించింది. ఫారిన్‌ మినిస్ట్రీ వ్యతిరేకించినా ప్రభుత్వం ఈ ప్రపోజల్‌కి ఆమోదం తెలిపింది. విదేశీయుడికి విజిట్‌ వీసాను స్పాన్సర్‌ చేసేవారు, కాంప్రహెన్సివ్‌ హెల్త్‌ పాలసీ అప్లికేషన్‌ ఫామ్‌ని అటాచ్‌ చేయవలసి ఉంటుంది. ఈ ఇన్స్యూరెన్స్‌ ద్వారా విజిటర్‌, దేశంలోని ప్రైవేటు హాస్పిటల్స్‌ నుంచి ఉచితంగా వైద్యం పొందే అవకాశముంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com