ఖతార్‌లో భారతీయ ఖైదీలకు తమిళనాడు ప్రభుత్వ సహాయం

- July 28, 2016 , by Maagulf
ఖతార్‌లో భారతీయ ఖైదీలకు తమిళనాడు ప్రభుత్వ సహాయం

భారతదేశంలోని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఓ కేసులో శిక్ష ఎదుర్కొంటున్న ముగ్గురు ఖైదీలకు న్యాయ సహాయం అందించేందుకుగాను ముందుకు రావడం ఖతార్‌లో ఇదే ప్రధమం. 2012లో దోహాలోని న్యూ సలాటా ఏరియాలో జరిగిన ఖతారీ మహిళ హత్య కేసులో ముగ్గురు వ్యక్తులు దోషులుగా తేలారు. వీరిలో ఇద్దరికి మరణ శిక్ష విధించారు. మరో వ్యక్తికి జీవిత ఖైదు విధించబడింది. ఈ కేసులో అప్పీల్‌ కోసం నాన్‌ రెసిడెంట్స్‌ ఇండియన్‌ (ఎన్‌ఆర్‌ఐ) సెల్‌ ఆఫ్‌ తమిళనాడు గవర్నమెంట్‌, 9,50,000 (51,000 ఖతారీ రియాల్స్‌) చెక్‌ని క్లియర్‌ చేసి ఢిల్లీకి పంపించారు. దోహా లా ఫర్మ్‌కి ఈ మొత్తాన్ని పంపించి, కోర్టు తీర్పుపై అప్పీల్‌ చేయనున్నారు. దోషుల్లో ఒకరైన పెరుమాల్‌ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నట్లు ఆయన భార్య రాజమ్మాల్‌ చెప్పారు. రాజమ్మాల్‌ కూడా ఇటీవలే సర్జరీ చేయించుకున్నారు. పెరుమాల్‌కి రెగ్యులర్‌ డయాలసిస్‌ అవసరమని రాజమ్మాల్‌ తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com