ఒమన్‌ జాతీయులకి ఉన్నత ఉద్యోగాలు: ప్రభుత్వ విజ్ఞప్తి

- July 28, 2016 , by Maagulf
ఒమన్‌ జాతీయులకి ఉన్నత ఉద్యోగాలు: ప్రభుత్వ విజ్ఞప్తి

ఒమన్స్‌ మినిస్ట్రీ ఆఫ్‌ ఫైనాన్స్‌, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కంపెనీలు ఇకపై ఎక్కువగా ఒమనీ ఎంప్లాయీస్‌కి అవకాశం కల్పించాలనీ, సీనియర్‌ పొజిషన్లలో వారికే పెద్ద పీట వేయాలని సర్కులర్‌లో పేర్కొంది. ఈ కంపెనీల్లో చాలా తక్కువగా నేషనలైజేషన ప్రక్రియ జరుగుతోందని స్టేట్‌ ఆడిట్‌ కంట్రోల్‌ రిపోర్ట్‌లో స్పష్తమవడంతో మినిస్ట్రీ ఆఫ్‌ ఫైనాన్స్‌ ఈ చర్యల్ని తీసుకుంది. సీనియర్‌ పొజిషన్లలో ఉన్న వలసదారుల్ని ఒమనీయులతో రీప్లేస్‌ చేయాలని ఈ సందర్బంగా అల్టిమేటం జారీ చేసింది. కొన్ని కంపెనీలలో 70 శాతం పైగా ఉద్యోగులు వలసదారులేననీ, వారంతా 60 ఏళ్ళ వయసు పైబడినవారేనని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ఐదేళ్ళ ప్లాన్‌ పెట్టుకుని, వలసదారుల్ని ఒమనీయులతో రీప్లేస్‌ చేసే చర్యలు తీసుకోవాలని మినిస్ట్రీ కోరింది. ఎయిర్‌ ట్రావెల్‌ విషయంలో అండర్‌ సెక్రెటరీలు, అడ్వైజర్లు, డాక్టర్లు, కన్సల్టెంట్లు, ఎక్స్‌పర్ట్‌లు, వాలిస్‌ తదితరులకు బిజినెస్‌ క్లాస్‌ టిక్కెట్లు ఇవ్వాలనీ,మిగిలినవారికి ఎకానమీ క్లాసు ఇవ్వాలని మినిస్ట్రీ సూచించింది. ప్రభుత్వ ఏజెన్సీలకు సంబంధించిన వాహనాలకు ట్రాకింగ్‌ డివైజ్‌లను ఏర్పాటు చేయాల్సిందిగా ఈ సందర్భంగా ఆదేశాలు జారీ అయ్యాయి. అంతర్జాతీయంగా చమురు ధరల పతనంతో మినిస్ట్రీ ఇప్పటిదాకా 19 సర్క్యులర్స్‌ జారీ చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com