డ్రైవింగ్‌లో మొబైల్‌ ఫోన్‌ వాడకంపై హెచ్చరిక

- July 28, 2016 , by Maagulf
డ్రైవింగ్‌లో మొబైల్‌ ఫోన్‌ వాడకంపై హెచ్చరిక

డ్రైవింగ్‌ చేస్తూ మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడేవారిపై ఇక నుంచి కఠిన చర్యలు తప్పవు. అక్కడికక్కడే వారిని బుక్‌ చేసేందుకు ట్రాఫిక్‌ పెట్రోల్స్‌, సెక్యూరిటీ పర్సనల్‌ సంసిద్ధంగా ఉన్నారని మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ హెచ్చరించింది. ట్విట్టర్‌ ద్వారా మొబైల్‌ ఫోన్‌ వాడుతూ డ్రైవింగ్‌ చేయడం పట్ల కలిగే అనర్ధాలను తెలియజేస్తున్న మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌, అలాంటి చర్యలకు ఎవరూ పాల్పడకూడదని విజ్ఞప్తి చేసింది. మొబైల్‌ ఫోన్‌ వాడుతూ వాహనాల్ని నడపడం వల్ల ఏకాగ్రత దెబ్బతింటుందనీ, ప్రమాదాలకు కారణమవుతుందనీ, ఆ ప్రమాదాల్లో ఇతరులు కూడా చనిపోయే అవకాశం ఉన్నందున ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నామని మినిస్ట్రీ పేర్కొంది. మొబైల్‌ ఫోన్‌ వాడుతూ డ్రైవింగ్‌ చేసేవారి విషయంలో అవగాహన పెంచేందుకు కార్యక్రమాలు చేపడ్తున్నామనీ, అలాగే దీన్ని అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు సలహాలు అందించవలసిందిగా మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ కోరింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com