జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- January 13, 2026
దోహా: ఖతార్ లో ప్రైవేట్ స్కూల్స్ మరియు కిండర్గార్టెన్లులో సామాజిక బాధ్యత ప్రాజెక్ట్ కింద ఫ్రీ, రాయితీ సీట్ల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 20న ప్రారంభమవుతుందని ఖతార్ విద్యా మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ (MoEHE) ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ కింద మొత్తం 3,500 ఉచిత మరియు రాయితీ సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఒకసారి చేరిన విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే వరకు ఈ ప్రాజెక్టు కింద చదువుకోవచ్చని పేర్కొంది.
మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ ప్రాజెక్ట్‌లో పూర్తిగా ఉచిత సీట్లు, రాయితీ సీట్లు, వికలాంగ విద్యార్థుల కోసం కేటాయించిన ఉచిత సీట్లు, ఖతారీ విద్యార్థుల కోసం సీట్లతో సహా అనేక రకాల సీట్లు ఉన్నాయని విద్యామంత్రిత్వశాఖ తెలిపింది. అన్ని జాతీయతలకు చెందిన కుటుంబాలకు ఈ సీట్లు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. ఉచిత సీట్ల కోసం దరఖాస్తు చేసుకునే కుటుంబ మొత్తం ఆదాయం 10,000 ఖతారీ రియాల్స్‌ను మించకూడదని తెలిపింది. ఇక రాయితీ సీట్ల కోసం ఆదాయ పరిమితి 15,000 రియాల్స్‌గా నిర్ణయించారు. బ్రిటిష్, ఇండియన్, అమెరికన్ మరియు నేషనల్ సిలబస్ స్కూళ్లలో సీట్లు అందుబాటులో ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం







