రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!

- January 13, 2026 , by Maagulf
రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!

రియాద్ః రాయల్ కమిషన్ ఫర్ రియాద్ సిటీ (RCRC) రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణ ప్రాజెక్టు కాంట్రాక్టును మంజూరు చేసింది.  దీని ద్వారా ఈ రెడ్ లైన్ ను 8.4 కిలోమీటర్ల మేర పొడిగించనున్నారు. కింగ్ సౌద్ విశ్వవిద్యాలయం నుండి దిరియా గేట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ వరకు కొనసాగుతుంది. ఐదు కొత్త స్టేషన్‌ లు ఈ లైన్ లో కొత్తగా రానున్నాయి.
RCRC సీఈఓ ఇంజనీర్ ఇబ్రహీం అల్-సుల్తాన్ మాట్లాడుతూ..రెడ్ లైన్ విస్తరణ ప్రాజెక్ట్ రియాద్ ప్రజా రవాణా నెట్‌వర్క్‌ను మెరుగుపరుస్తుందని తెలిపారు. రియాద్ లోని కీలక సెంటర్లు, నివాస సముదాయాలు, సాంస్కృతిక, విద్యా కేంద్రాలను అనుసంధానిస్తుందని పేర్కొన్నారు. 2024 చివరిలో కార్యకలాపాలు ప్రారంభం కాగా, మొత్తం ప్రయాణికుల సంఖ్య 173 మిలియన్లు దాటిందని తెలిపారు.  
ఈ కొత్త విస్తరణలో 7.1 కిలోమీటర్ల లోతైన భూగర్భ టన్నెల్స్, 1.3 కిలోమీటర్ల ఎలివేటెడ్ ట్రాక్‌లు మరియు కొత్త స్టేషన్ల నిర్మాణం ఉంటుంది. రెండు స్టేషన్లు కింగ్ సౌద్ విశ్వవిద్యాలయంలో ఉంటాయి. ఒకటి మెడికల్ సిటీ మరియు ఆరోగ్య కళాశాలలకు, మరొకటి విశ్వవిద్యాలయ ప్రాంగణానికి దగ్గరగా ఉంటుంది. దిరియాలో మరో మూడు స్టేషన్లు ఉంటాయి. టిలో ఒకటి భవిష్యత్తులో లైన్ 7తో ఇంటర్‌ఛేంజ్‌గా మార్చేందుకు ప్రణాళిక ఉందన్నారు. ఈ ప్రాజెక్ట్ సుమారు ఆరు సంవత్సరాలలో పూర్తి అవుతుందని భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com