దంపతులను రూ.15కోసం హత్య చేసిన షాప్ యజమాని

- July 28, 2016 , by Maagulf
దంపతులను రూ.15కోసం హత్య చేసిన షాప్ యజమాని

ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ దళిత దంపతులను ఓ షాపు యజమాని కర్కశంగా చంపేశాడు. కత్తితో దాడి చేసి వారిని హత్య చేశాడు. అది కూడా కేవలం రూ.15 అప్పు చెల్లించనుందుకు. ఈ ఘటన మెయిన్ పురి నియోజకవర్గంలో చోటుచేసుకుంది. ఇది సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ నియోజకవర్గం.పోలీసులు వివరాల ప్రకారం ఓ దుకాణంలో ఏవో సరుకుల నిమిత్తం దళిత దంపతులు పదిహేను రూపాయలు అప్పు చేశారు. వాటిని చెల్లించడం విఫలమయ్యారు. దానిపై ప్రశ్నించిన యజమాని ఆ వెంటనే వారిద్దరిపై కత్తితో దాడి చేసి చంపేశాడు. పోలీసులు హత్య చేసిన షాపు యజమానిని అదుపులోకి తీసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com