ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- July 22, 2026
న్యూ ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టుల వేగవంతమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులతో వరుసగా సమావేశం కానున్నారు. విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై సుదీర్ఘంగా చర్చించనున్న ఈ పర్యటన ప్రస్తుతం రాజకీయంగా, పరిపాలనాపరంగా తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ పర్యటనలో ప్రధాన ఆకర్షణ(Andhra Pradesh) భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం. విజయనగరం జిల్లాలో అత్యంత వేగంగా రూపుదిద్దుకున్న ఈ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉత్తరాంధ్ర పర్యాటక, ఆర్థిక రంగాను కొత్త మలుపు తిప్పే ఈ విమానాశ్రయాన్ని తన చేతుల మీదుగా ప్రారంభించాలని ప్రధాని మోదీని చంద్రబాబు ఆహ్వానించనున్నారు. దీనితో పాటు రాజధాని అమరావతి నిర్మాణ పనులు, పోలవరం ప్రాజెక్టు తాజా పురోగతిపై కూడా ప్రధానితో ప్రత్యేకంగా చర్చించనున్నారు.
ప్రధాని భేటీ అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలసి విభజన సమస్యలు, సీఆర్ పాటిల్‌తో పోలవరం నిధుల విడుదలపై సీఎం మాట్లాడతారు. అలాగే పియూష్ గోయల్‌తో కొత్త పరిశ్రమల రాకపై, మనోహర్ లాల్ ఖట్టర్‌తో అమరావతికి కేంద్ర సాయంపై భేటీ కానున్నారు. బుధవారం ఉదయం 7:30 గంటలకు అమరావతి నుండి బయలుదేరి 10 గంటలకు ఢిల్లీ చేరుకునే చంద్రబాబు, రాత్రి అక్కడే బస చేసి గురువారం ఉదయం తిరిగి విజయవాడ చేరుకుంటారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 7 దాడుల కథనంపై స్పందించిన ఎమిరేట్స్..!!
- సౌదీలో 5 రోజులపాటు వర్షాలు.. ప్రజలకు హెచ్చరిక..!!
- యూకేలో టెక్నికల్ ప్రాబ్లమ్.. ఖతార్ ఎయిర్వేస్ విమానాలకు అంతరాయం..!!
- లుసైల్ మరీనా ఇంటర్సెక్షన్ వద్ద యూ-టర్న్ మూసివేత..!!
- యూరోపియన్ దేశాల ప్రకటనను స్వాగతించిన ఒమన్..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాలో తనిఖీలు.. 74 సంస్థలపై చర్యలు..!!
- ఇరాన్ ట్యాంకర్లను ధ్వంసం చేసిన అమెరికా.. ప్రతీకారంగా ఇరాన్ మిసైల్ దాడులు
- బీసీసీఐ అసోసియేట్ స్పాన్సర్‌గా ChatGPT..!
- భారత్–కువైట్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చలు







