గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- July 22, 2026
విజయవాడ:- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాన్ని పొందిన సంస్థగా గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా భారతీనగర్‌లోని సంస్థ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చైతన్య జంగా, జయాపటేరియాలు మాట్లాడుతూ, నాణ్యత, పారదర్శకత, విశ్వసనీయత, నిరంతర అభివృద్ధికి తమ అంకితభావాన్ని గర్వంగా తెలియజేస్తోందన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక ధృవీకరణ తమ సంస్థ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నాణ్యతా నిర్వహణ ప్రమాణాలను అనుసరిస్తోందని నిర్ధారిస్తుందని తెలిపారు. తమ సభ్యులు, భాగస్వాములు మరియు సమాజానికి అత్యుత్తమ సేవలను అందించడంలో సమర్థంగా, విశ్వసనీయంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభను గుర్తించడం, నాయకత్వాన్ని ప్రోత్సహించడం, సామాజిక సేవకు ప్రాధాన్యత ఇవ్వడం తమ సంస్థ ప్రధాన లక్ష్యం అని చెప్పారు. స్పష్టం చేశారు. ప్రతి కార్యక్రమంలో నైతిక విలువలు, వృత్తిపరమైన నిబద్ధత పాటిస్తూ అత్యున్నత ప్రమాణాలను కొనసాగించేందుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో సంస్థ ఉపాధ్యక్షుడు మితాని ఈశ్వరరావు, సంయుక్త కార్యదర్శి శ్రీ కోడే చైతన్య, కోశాధికారి ఆర్.వి.అప్పారావు, ఎగ్యిక్యూటీవ్ కమిటీ సభ్యులు ఎ.నవీన్, ధనిష్టా బత్తుల, ఇమ్మానియేల్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 7 దాడుల కథనంపై స్పందించిన ఎమిరేట్స్..!!
- సౌదీలో 5 రోజులపాటు వర్షాలు.. ప్రజలకు హెచ్చరిక..!!
- యూకేలో టెక్నికల్ ప్రాబ్లమ్.. ఖతార్ ఎయిర్వేస్ విమానాలకు అంతరాయం..!!
- లుసైల్ మరీనా ఇంటర్సెక్షన్ వద్ద యూ-టర్న్ మూసివేత..!!
- యూరోపియన్ దేశాల ప్రకటనను స్వాగతించిన ఒమన్..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాలో తనిఖీలు.. 74 సంస్థలపై చర్యలు..!!
- ఇరాన్ ట్యాంకర్లను ధ్వంసం చేసిన అమెరికా.. ప్రతీకారంగా ఇరాన్ మిసైల్ దాడులు
- బీసీసీఐ అసోసియేట్ స్పాన్సర్‌గా ChatGPT..!
- భారత్–కువైట్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చలు







