యూఏఈలో నెస్లే ఇన్‌ఫాంట్ ఫార్ములా అదనపు బ్యాచ్‌ల రీకాల్..!!

- January 16, 2026 , by Maagulf
యూఏఈలో నెస్లే ఇన్‌ఫాంట్ ఫార్ములా అదనపు బ్యాచ్‌ల రీకాల్..!!

యూఏఈ: యూఏఈకి చెందిన ఎమిరేట్స్ డ్రగ్ ఎస్టాబ్లిష్‌మెంట్ (EDE) నెస్లే ఇన్‌ఫాంట్ ఫార్ములా అదనపు బ్యాచ్‌లను రీకాల్ చేసింది. వైద్య పర్యవేక్షణలో ప్రత్యేకంగా ఉపయోగించడానికి ఉద్దేశించిన ప్రొడక్ట్ S26 AR ను చేర్చింది. ముందుజాగ్రత్త రీకాల్ పరిధిని విస్తరించినట్లు ప్రకటించింది. ప్రభావిత బ్యాచ్‌లు 5185080661, 5271080661, మరియు 5125080661 అని సంస్థ వెల్లడించింది.  

ఆయా ప్రొడక్టుల్లోబాసిల్లస్ సెరియస్ అనే బాక్టీరియం ఆనవాళ్లు కనిపించడంతో రీకాల్ చేశారు. దీని కారణంగా ఆహార సంబంధిత అనారోగ్యాలు,  వికారం, వాంతులు మరియు కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయని పేర్కొన్నారు. నెస్లేతో సమన్వయంతో, పంపిణీదారుల గోడౌన్లలో ఉన్న అన్ని ప్రభావిత బ్యాచ్‌లను భద్రపరిచినట్లు EDE తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com