జనవరి 19న సివిల్ డిఫెన్స్ సైరన్‌ టెస్ట్ రన్..!!

- January 16, 2026 , by Maagulf
జనవరి 19న సివిల్ డిఫెన్స్ సైరన్‌ టెస్ట్ రన్..!!

కువైట్: కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) జనవరి 19న ఉదయం 10 గంటలకు సివిల్ డిఫెన్స్ సైరన్‌ల టెస్ట్ రన్ ను నిర్వహించనుంది. ఈ సందర్భంగా పలు కీలక సూచనలు చేసింది. ఇది ఒక సాధారణ మరియు ముందు జాగ్రత్త చర్యలో భాగమని తెలిపింది. సైరన్ సౌండ్ రాగానే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. అన్ని ప్రాంతాలలో ప్రజా భద్రతను సన్నద్ధం చేయడానికి సైరెన్ టెస్ట్ రన్ లక్ష్యమని తెలిపింది.  
జాతీయ హెచ్చరిక వ్యవస్థ  సామర్థ్యాన్ని నిర్ధారించడానికి జరుగుతున్న నిరంతర ప్రయత్నాలలో భాగంగా ప్రతి నెలా మొదటి సోమవారం ఉదయం 10 గంటలకు ఇటువంటి సైరన్ పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహించబడతాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com