ట్రంప్‌కు నోబెల్ అందజేసిన మరియా కొరినా మచాడో

- January 16, 2026 , by Maagulf
ట్రంప్‌కు నోబెల్ అందజేసిన మరియా కొరినా మచాడో

అమెరికా: వెనిజులాలో ప్రజాస్వామ్యం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న విపక్ష నాయకురాలు, 2025 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరియా కొరినా మచాడో.. గురువారం వైట్ హౌస్‌లో, అమెరికా  అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఆయనకు తన నోబెల్ బహుమతి పతకాన్ని బహూకరించారు.

మచాడో ఈ మెడల్‌ను అందజేస్తూ ఒక చారిత్రాత్మక కథను ప్రస్తావించారు. 1825లో అమెరికా విప్లవ వీరుడు మార్క్విస్ డి లాఫాయెట్, జార్జ్ వాషింగ్టన్ ముఖచిత్రం ఉన్న మెడల్‌ను వెనిజులా విముక్తి వీరుడు సైమన్ బోలివర్‌కు బహూకరించారు. ఇప్పుడు దానికి ప్రతిగా, బోలివర్ వారసులుగా.. వెనిజులా ప్రజలు వాషింగ్టన్ వారసుడైన ట్రంప్‌నకు ఈ నోబెల్ మెడల్‌ను అందజేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. దీంతో ట్రంప్ తెగ సంబుర పడిపోయారు. 

ఈ పరిణామంపై నార్వేజియన్ నోబెల్ ఇనిస్టిట్యూట్ స్పందించింది. బహుమతి పతకాన్ని ఒకరి నుంచి మరొకరు తీసుకోవచ్చని, కానీ నోబెల్ గ్రహీత హోదాను మాత్రం బదిలీ చేయడం, పంచుకోవడం లేదా రద్దు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. కాగా, “ఈ బహుమతి వెనెజువెలా ప్రజలది. దీనిని ట్రంప్‌తో పంచుకోవాలని మేము కోరుకుంటున్నాం” అని మచాడో గతంలోనే వ్యాఖ్యానించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com