ఎన్‌ఆర్‌ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్‌టిఆర్ 30వ వర్ధంతి

- January 19, 2026 , by Maagulf
ఎన్‌ఆర్‌ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్‌టిఆర్ 30వ వర్ధంతి

బహ్రెయిన్: తెలుగు జాతి గౌరవాన్ని విశ్వవేదిక పై నిలిపిన మహానేత, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, పద్మశ్రీ నందమూరి తారక రామారావు (ఎన్‌టిఆర్)30వ వర్ధంతిని పురస్కరించుకుని ఎన్‌ఆర్‌ఐ టీడీపీ బహ్రెయిన్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎన్‌టిఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయన సినీ రంగంలో చేసిన అపూర్వ సేవలు, రాజకీయాల్లో ప్రవేశించి పేదల పక్షాన నిలబడి సంక్షేమ పాలన అందించిన తీరు, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన విధానాన్ని నాయకులు స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వీడియో కాల్ ద్వారా పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ,ఎన్‌టిఆర్ తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయిన మహానేత అని, రాజకీయాల్లో విలువలు, ప్రజాస్వామ్యాన్ని బలపరిచిన అపూర్వ వ్యక్తిత్వమని కొనియాడారు. ఎన్‌టిఆర్ గారి ఆశయాలను నేటి తరాలు కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.

ఎన్‌టిఆర్ గారు ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు నేటికీ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాయని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత ప్రతి టీడీపీ కార్యకర్త పై ఉందని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, ఎన్‌టిఆర్ గారి విలువలు నేటి యువతకు ఆదర్శంగా నిలవాలని వారు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐ టీడీపీ బహ్రెయిన్ నాయకులు రఘునాథ్ బాబు,హరి బాబు, సతీష్ శెట్టి,రామ మోహన్,సతీష్, ఇంతియాజ్ అహమద్,మౌళి చౌదరి,కిషోర్,అనిల్,నాగార్జున మరియు వారి కుటుంబ సభ్యులు, అలాగే పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్గొని ఎన్‌టిఆర్ సేవలను ఘనంగా స్మరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com