విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- January 19, 2026
దోహా: విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఫిబ్రవరి 1 నుండి అబు సమ్రా మీదుగా ఖతార్లోకి ప్రవేశించే విదేశీ వాహనాలు.. దేశంలోకి ప్రవేశించే ముందు ఎలక్ట్రానిక్‌గా వెహికల్ ఇన్సూరెన్స్ ను పొందే అవకాశాన్ని కల్పించారు. ఇది బార్డర్ ఎంట్రీ ప్రక్రియను వేగవంతం చేస్తుందని ప్రకటించారు.
ఖతార్ యూనిఫైడ్ ఇన్సూరెన్స్ బ్యూరో MSAR అనే ఎలక్ట్రానిక్ వ్యవస్థను ప్రారంభించింది. ఇది పర్యాటకులు వెహికల్ ఇన్సూరెన్స్ ప్రక్రియలను ఎలక్ట్రానిక్‌గా పూర్తి చేయడానికి అనుమతిస్తుంది. వాహనదారులు యాప్ ద్వారా ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. నిరంతరం అవసరమైన టెక్నికట్ సపోర్టును కూడా పొందవచ్చు.
అయితే, చెల్లుబాటు అయ్యే ముందస్తు ఇన్సూరెన్స్ ఉన్న వాహనాలకు బార్డర్ వద్ద ప్రత్యేక లేన్ ఉంటుందని, ఇది వేగవంతమైన ఎంట్రీ ప్రక్రియకు వీలు కల్పిస్తుందని ఒక MSAR అధికారి వెల్లడించారు. కాగా, ఖతార్‌కు ఒకవేళ పర్యటన రద్దు అయిన సందర్భంలో ఇన్సూరెన్స్ ను సైతం రద్దు చేసుకుని, డబ్బులను రీ ఫండ్ పొందడానికి కూడా ఈ అప్లికేషన్లో అవకాశం ఉంటుందని ఆ అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం







