ఆగస్ట్‌లో తగ్గనున్న యూఏఈ ఇంధన ధరలు
- July 28, 2016
యూఏఈలో ఇంధన ధరలు ఆగస్ట్ నెలకుగాను తగ్గనున్నట్లు మినిస్ట్రీ వర్గాలు ప్రకటించాయి. ఆగస్ట్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త ధరలు ఈ విధంగా ఉంటాయి. సూపర్ 98 పెట్రోల్ ధర 1.72 దిర్హామ్‌లు (ప్రస్తుతం 1.88), స్పెషల్ 95 పెట్రోల్ 1.62 (ప్రస్తుతం 1.77), ఇ ప్లస్ 91 పెట్రోల్ 1.55 (ప్రస్తుతం 1.70)గా ఉంటాయి. అంతర్జాతీయ సరాసరి క్రూడ్ ధరల ప్రకారం పెట్రోధరల్ని సవరిస్తూ వస్తున్నారు. జనవరిలో 30 డాలర్లకు దిగువకు చేరిన బ్యారెల్ ముడి చమురు ధరలు గత నెలలో 50 డాలర్ల పైకి చేరుకుంది. గురువారం అంతర్జాతీయ మార్కెట్లో 44 డాలర్లకు బ్యారెల్ ముడి చమురు ధరలు తగ్గాయి. గత ఏడాది జులైలో మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ ఇంధన ధరల్ని లిబరలైజ్ చేసింది
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







