'వనం-మనం' కార్యక్రమం ఉద్యమంలా

- July 28, 2016 , by Maagulf
'వనం-మనం' కార్యక్రమం ఉద్యమంలా

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్రంలో 'వనం-మనం' కార్యక్రమం ఉద్యమంలా సాగుతోంది. ఇవాళ ఒక్కరోజే కోటి మొక్కలు నాటాలనే లక్ష్యంతో అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు 'వనం- మనం' కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.
* తూర్పుగోదావరిజిల్లా కాకినాడ తిలక్‌వీధిలో హోం మంత్రి చినరాజప్ప వనం-మనం కార్యక్రమాన్ని ప్రారంభించి మొక్కలు నాటారు. * విశాఖ కంభాలకొండ అటవీప్రాంతంలో ఏర్పాటు చేసిన వనం-మనం కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్‌ ప్రవీణ్‌, అధికారులు పాల్గొన్నారు. * గుంటూరు జిల్లా పేరేచర్ల మండలం నల్లపాడు రిజర్వ్‌ ఫారెస్టులో 'వనం-మనం' కార్యక్రమాన్ని మంత్రి రావెల కిశోర్‌బాబు ప్రారంభించారు. జిల్లాల్లో 16.50 లక్షల మొక్కలు నాటేందుకు అటవీశాఖ ఏర్పాట్లు చేసింది. * తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని దానవాయిపేటలో మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వనం-మనం కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మున్సిపల్‌ కమిషనర్‌ విజయరామరాజు, మేయర్‌ రజనీశేషసాయి పాల్గొని మొక్కలు నాటారు. * విజయవాడ బీఆర్‌టీఎస్‌ రోడ్డులో 'వనం-మనం' కార్యక్రమాన్ని ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. మొక్కల పెంపకంపై అవగాహన కోసం వేలమంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com