BBQ పొగ హానికరమా?

- January 22, 2026 , by Maagulf
BBQ పొగ హానికరమా?

యూఏఈ:  యూఏఈలో వింటర్ ప్రారంభమైంది. ఇప్పుడు పార్కులు, బీచ్‌లు మరియు ఇతర ఖాళీ ప్రాంతాలలో బార్బెక్యూ వాసనలు గుప్పుమంటున్నాయి.  చాలా కుటుంబాలకు, బార్బెక్యూ చేయడం రుచికి సంబంధించిన అంశం. అయితే, ఆ గ్రిల్స్ నుండి వచ్చే పొగ రుచి కంటే ఎక్కువ నష్టం చేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.

మాంసాన్ని అధిక వేడి మీద, ముఖ్యంగా బొగ్గుపై కాల్చినప్పుడు పొగ ఏర్పడుతుందని, ఈ పొగ PAHలు మరియు HCAలు వంటి హానికరమైన సమ్మేళనాలను కలిగి ఉంటుందని ఇంటర్నేషనల్ మోడరన్ హాస్పిటల్ దుబాయ్‌లోని స్పెషలిస్ట్ పల్మోనాలజిస్ట్ డాక్టర్ ముహమ్మద్ అస్లాం తెలిపారు. వీటిని తరచుగా పీల్చినప్పుడు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంటుందని చెప్పారు. కాగా, తక్షణమే ప్రమాదం ఉండదని, కానీ ఎక్కువగా కాల్చిన ఆహారాన్ని తరచుగా గ్రిల్ చేయడంతో సమస్యలు ఏర్పడతాయని తెలిపారు.   

BBQ పొగలో ఊపిరితిత్తులను చికాకు పెట్టే మరియు రక్తప్రవాహంలోకి ప్రవేశించే సమ్మేళనాలు ఉంటాయని, ఊపిరితిత్తులు, పెద్దప్రేగు మరియు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ల ప్రమాదాన్ని పెంచుతుందని మెడ్‌కేర్ రాయల్ స్పెషాలిటీ హాస్పిటల్ అల్ కుసైస్‌కు చెందిన డాక్టర్ మొహమ్మద్ హారిస్ తెలిపారు. పార్కులలో ఒకేసారి పెద్ద సంఖ్యలో BBQలు జరుగుతుంటాయని, ఇది  పాసివ్ స్మోకింగ్‌కు సమానం అని ఆయన పేర్కొన్నారు.

గ్రిల్‌పై కాల్చడానికి ముందు మాంసాన్ని ఉడికించడం, కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి బొగ్గుకు బదులుగా గ్యాస్ గ్రిల్‌లను ఉపయోగించడం, గ్రిల్ చేసిన కూరగాయలను అధికంగా ఉపయోగించడంవంటి మార్పుల ద్వారా ప్రమాద తీవ్రతను తగ్గించుకోవచ్చని ఆయన సూచించారు.  అదే సమయంలో బార్బెక్యూ ద్వారా కొన్నిరకాల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని డాక్టర్ హారిస్ చెప్పారు. మసాలాలు, అధిక కొవ్వు మాంసాలు మరియు రాత్రి ఆలస్యంగా తినడం వల్ల అజీర్ణం పెరుగుతుందన్నారు. జీర్ణక్రియకు సహాయపడటానికి ఎక్కువ కూరగాయలు తినాలని, మాంసం శాతాన్ని తగ్గించి, ఎక్కువ నీరు త్రాగాలని ఆయన అడ్వైజ్ ఇచ్చారు.

పెద్దలలో కంటే పిల్లలలో సమస్యలు త్వరగా కనిపిసాయని సౌదీ జర్మన్ హాస్పిటల్ అజ్మాన్‌లో శ్వాసకోశ వ్యాధులు మరియు కన్సల్టెంట్ పల్మోనాలజిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ హసన్ అరెఫ్ షబానా తెలిపారు. దగ్గు, గొంతు వాపు వంటి లక్షణాలు ఉంటాయని,  ఇప్పటికే ఉన్న ఊపిరితిత్తుల వ్యాధి దీర్ఘకాలంలో క్యాన్సర్ కు దారితీసే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com