2025లో ఖతార్ లో 3% పెరిగిన ప్యాసింజర్స్..!!

- January 22, 2026 , by Maagulf
2025లో ఖతార్ లో 3% పెరిగిన ప్యాసింజర్స్..!!

దోహా: ఖతార్ 2025లో 54.3 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలు అందించింది. ఇది 2024తో పోలిస్తే 3% ఎక్కువ అని ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (QCAA) ప్రకటించింది.  ఆగస్టు నెలలో 5 మిలియన్ల ప్రయాణికులతో అత్యధిక నెలవారీ ట్రాఫిక్ నమోదైంది.  ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్ మరియు సంస్కృతిలో ప్రధాన అంతర్జాతీయ కార్యక్రమాల ద్వారా ఖతార్ సందర్శకులను ఆకర్షించిందని తెలిపింది. 

వెబ్ సమ్మిట్ ఖతార్, దోహా ఫోరం 11వ సెషన్ ఆఫ్ కాన్ఫరెన్స్ ఆఫ్ స్టేట్స్ పార్టీస్ టు UNCAC వంటి ఉన్నత స్థాయి సమావేశాలతోపాటు FIFA అరబ్ కప్, FIFA ఇంటర్ కాంటినెంటల్ కప్, U-17 వరల్డ్ కప్ మరియు ఫార్ములా 1 ఖతార్ ఎయిర్‌వేస్ గ్రాండ్ ప్రిక్స్, ఖతార్ ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్, దోహా జ్యువెలరీ అండ్ వాచెస్ ఎగ్జిబిషన్, లుసైల్ స్కై ఫెస్టివల్ మరియు ఖతార్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ వంటి ప్రయాణ డిమాండ్‌ను పెంచడానికి సహాయపడిందని వెల్లడించింది. వీటితోపాటు ఖతార్ సహజ ప్రకృతి సంపద, బీచ్‌లు మరియు మడ అడవులు ఆకర్షణను మరింత విస్తృతం చేశాయని పేర్కొంది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com