సోహార్‌లోని కార్మికుల వసతి గృహంలో అగ్నిప్రమాదం..!!
- January 23, 2026
మస్కట్: సోహార్ విలాయత్‌లోని కార్మికుల వసతి గృహంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.ప్రమాద సమాచారం అందుకున్న నార్త్ అల్ బతినా గవర్నరేట్‌కు చెందిన సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని వేగంగా స్పందించాయి. వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇతర ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా సకాలంలో చర్యలు తీసుకున్నారని, దాంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. సకాలంలో మంటలను విజయవంతంగా ఆర్పివేసినట్లు, ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని అథారిటీ ప్రకటించింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొంది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- రిమాల్ అల్ షర్కియాహ్ పర్యాటక ప్రాంత అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్..!!
- ‘ది న్యూయార్కర్’ కథనంపై తీవ్రంగా స్పందించిన ఖతార్..!!
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక







