ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!

- January 24, 2026 , by Maagulf
ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!

న్యూఢిల్లీ:  ఏడాది లో 5 ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే ఇక డ్రైవింగ్ లైసెన్స్ రద్దు కానుంది. ఈ మేరకు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ, జాతీయ మోటారు వాహనాల నిబంధనల్లో మార్పులు చేసింది. జనవరి 1 నుండి ఇది వర్తించనుంది. కొత్త సవరణ ప్రకారం.. ఒకే సంవత్సరంలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారి  డ్రైవింగ్ లైసెన్స్‌ ను రద్దు చేయనున్నారు. కాగా,  లైసెన్స్‌ ను సస్పెండ్ చేసే అధికారం సాధారణంగా ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO) లేదా జిల్లా రవాణా కార్యాలయం (DTO) కు ఉంటుందని స్పష్టం చేసింది.

అయితే, ఏదైనా సస్పెన్షన్‌కు ముందు లైసెన్స్ హోల్డర్‌కు వారి కేసును డిఫెండ్ చేసే అవకాశాన్ని కల్పించాలి. కాగా, వారి వాదనలు సరైనవి కాని సందర్భంలోనే వారి లైసెన్స్ ను రద్దు చేయాలని నిర్దేశించారు. వెహికల్ థెఫ్ట్, ప్రయాణీకులపై దాడి చేయడం లేదా హింసాత్మక ప్రవర్తన, ఓవర్ స్పీడ్ , ఓవర్‌లోడింగ్ చేయడం మరియు బహిరంగ ప్రదేశంలో అక్రమ పార్కింగ్ వంటి తీవ్రమైన 24 ఉల్లంఘనలను లెక్కించడానికి ఒక సంవత్సరం కాలపరిమితి అని అధికారిక నోటిఫికేషన్ స్పష్టం చేసింది.   కాగా, హెల్మెట్ లేదా సీట్‌బెల్ట్ ధరించకపోవడం లేదా సిగ్నల్ జంప్ వంటి నియమాలను పదేపదే ఉల్లంఘించడం కూడా డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్‌కు దారితీయవచ్చని అధికారులు చెబుతున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com