ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- January 24, 2026
న్యూఢిల్లీ: ఏడాది లో 5 ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే ఇక డ్రైవింగ్ లైసెన్స్ రద్దు కానుంది. ఈ మేరకు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ, జాతీయ మోటారు వాహనాల నిబంధనల్లో మార్పులు చేసింది. జనవరి 1 నుండి ఇది వర్తించనుంది. కొత్త సవరణ ప్రకారం.. ఒకే సంవత్సరంలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారి డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేయనున్నారు. కాగా, లైసెన్స్ ను సస్పెండ్ చేసే అధికారం సాధారణంగా ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO) లేదా జిల్లా రవాణా కార్యాలయం (DTO) కు ఉంటుందని స్పష్టం చేసింది.
అయితే, ఏదైనా సస్పెన్షన్‌కు ముందు లైసెన్స్ హోల్డర్‌కు వారి కేసును డిఫెండ్ చేసే అవకాశాన్ని కల్పించాలి. కాగా, వారి వాదనలు సరైనవి కాని సందర్భంలోనే వారి లైసెన్స్ ను రద్దు చేయాలని నిర్దేశించారు. వెహికల్ థెఫ్ట్, ప్రయాణీకులపై దాడి చేయడం లేదా హింసాత్మక ప్రవర్తన, ఓవర్ స్పీడ్ , ఓవర్లోడింగ్ చేయడం మరియు బహిరంగ ప్రదేశంలో అక్రమ పార్కింగ్ వంటి తీవ్రమైన 24 ఉల్లంఘనలను లెక్కించడానికి ఒక సంవత్సరం కాలపరిమితి అని అధికారిక నోటిఫికేషన్ స్పష్టం చేసింది. కాగా, హెల్మెట్ లేదా సీట్‌బెల్ట్ ధరించకపోవడం లేదా సిగ్నల్ జంప్ వంటి నియమాలను పదేపదే ఉల్లంఘించడం కూడా డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్‌కు దారితీయవచ్చని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్‌గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..
- గ్రీన్ హైడ్రోజన్‌తో భారత్ శక్తి విప్లవం
- కేటీఆర్, హరీశ్ రావు లతో కేసీఆర్ భేటీ







