రోడ్డున పడేసిన మస్కట్ రోడ్డ్ ప్రమాదం
- July 29, 2016
రోడ్డున పడేసిన మస్కట్ రోడ్డ్ ప్రమాదం. సహాయం కోసం కుటుంబీకుల ఎదురుచూపు. స్వదేశంలో పనులు సరిగ్గా దొరకక, పొట్ట చేతపట్టుకొని దూర దేశం వెళితే మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో మింగేసింది. కుటుంబ సభ్యులకు కన్నీరే మిగిల్చింది. ఇది బతుకు జీవుడా అంటూ దూరదేశాల్లో పనులు చేసుకునే వారి దుస్థితి. తాజాగా నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలం గుండారం గ్రామం ఎల్లాపూర్ తండాకు చెందిన గుగ్లోత్ దూల్యా (32) మస్కట్‌లో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టు గ్రామస్తులు తెలిపారు. బతుకు దెరువు కోసం లక్ష రూపాయలు అప్పుచేసి మస్కట్ దేశానికి వెళ్లాడని, అక్కడ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడని చెప్పారు. కంపెనీవారు మూడునెలల జీతం ఇవ్వగా, మరో మూడునెలల జీతం ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. ఇంతలోనే రోడ్డు పనులు జరుగుతున్న సమయంలోనే ట్యాంకర్ బోల్తాపడి దూల్యా అక్కడికక్కడే మృతి చెందినట్టు వారన్నారు. అప్పుల పాలైన ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, లేకుంటే ఆ కుటుంబం దిక్కులేని స్థితిలో ఉండాల్సి వస్తుందని అంటున్నారు. అలాగే దూల్యా మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరుతున్నారు. మృతునికిభార్య లక్ష్మి, కుమారుడు సతీష్, కుమార్తెలు స్వాతి, సుజిత ఉన్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







