గోస

- July 29, 2016 , by Maagulf
గోస

ఎగిలివారంగనే కల 

ఎందుకొచ్చెనో గిట్ల 
గుడిశె మీది బీరపువ్వు వాడిపోయినట్టు 
నీ సిగలోని మల్లెపువ్వు జారిపడ్డట్టు 

వాకిట్ల 
ఆటల్ల పాటల్ల 
సప్పుడే లేనట్టు 
బడి తలుపులు  మూతబడ్డట్టు

దేవుడు  దూరమైనట్టు 
దయ్యాలు దగ్గరైనట్టు 
ఊరు సిన్నబోయినట్టు 
ఎడ్లు బెంగటిల్లినట్టు 

కచ్రాల చక్రాలు 
విరిగి పడ్డట్టు 
కల్లంల పిడుగు 
ఉరిమి పడ్డట్టు 

చాటలో వరిగింజ 
మొలకెత్తినట్టు 
పొయ్యిలో కొర్రాయి 
చిగురించినట్టు


ఆవులు మేకలు 
కటికోనికిచ్చినట్టు 
ఇసిరెను గుడిశెను 
అంగట్ల పెట్టినట్టు 

పోశెమ్మ మైసమ్మ 
మర్సిపోయినట్టు 
ఎల్లవ్వ దుర్గవ్వ 
అలిగి వెళ్లినట్టు
 
ఎగిలివారంగనే కల 
ఎందుకొచ్చెనో గిట్ల 

కొమిరెల్లి మల్లన్నకు 
పట్నాలు వెయ్యనందుకో 
ఎములాడ రాజన్నకు 
కోడెను కట్టనందుకో 
ఇగురం  యాడ పోయెనో మనది 

ఎగిలివారంగనే కల 
ఎందుకొచ్చెనో గిట్ల 
గుడిశె మీది బీరపువ్వు వాడిపోయినట్టు 
నీ సిగలోని మల్లెపువ్వు జారిపడ్డట్టు

 పారువెల్ల 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com