2050 నాటికి 83.6 మిలియన్లకు జీసీసీ జనాభా..!!
- January 25, 2026
మస్కట్: గల్ఫ్ సహకార మండలి (జీసీసీ) దేశాల జనాభా 2050 నాటికి 83.6 మిలియన్లకు చేరుకోనుంది. ఈ మేరకు గల్ఫ్ స్టాటిస్టికల్ సెంటర్ విడుదల చేసిన ఒక నివేదిక తెలిపింది. ఈ నివేదిక 2025 నుండి 2050 మధ్య కాలంలో జీసీసీ అంతటా జనాభా పెరుగుదల కొనసాగుతుందని, మొత్తం జనాభా గణనీయంగా పెరుగుతుందని అంచనా వేసింది. ఇక వృద్ధ జనాభా రెట్టింపు అయి 5.5 మిలియన్లకు పైగా చేరుకుంటుందని నివేదిక పేర్కొంది.
2024 చివరి నాటికి జీసీసీ మొత్తం జనాభా సుమారు 61.5 మిలియన్లుగా ఉంది. ఇది 2019తో పోలిస్తే 8.5 మిలియన్ల మంది పెరుగుదలను సూచిస్తుంది. సగటు వార్షిక జనాభా వృద్ధి రేటు 2.8 శాతానికి చేరుకుంది. ఇది ప్రపంచ సగటు కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ. ఇది ఈ ప్రాంతంలో వేగవంతమైన జనాభా విస్తరణ అని పేర్కొంది.
ఇక వయసుల వారిగా చూస్తే..15–64 సంవత్సరాలు గల వారు మొత్తం జనాభాలో 76.7 శాతంగా ఉన్నారు. 0–14 సంవత్సరాల వారు 20.6 శాతంగా ఉండగా.. 65 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ ఉన్న వృద్ధులు 2.6 శాతంగా ఉన్నారని నివేదిక స్పష్టం చేసింది. జనాభాలో పురుషులు 62.7 శాతంగా మరియు మహిళలు 37.3 శాతంగా ఉన్నారు.
తాజా వార్తలు
- తైవాన్లోని అత్యంత ఎత్తైన భవనాన్ని అధిరోహించిన అమెరికన్ సాహసవీరుడు..!!
- సౌదీ పోర్టుల్లో 965 ప్రొహిబిటేడ్ ఐటమ్స్ సీజ్..!!
- దుబాయ్లో ఆస్తి కొనుగోలు చేస్తున్నారా?
- కువైట్ లోని లులు హైపర్ మార్కెట్లో ఇండియా ఉత్సవ్ వేడుకలు..!!
- 2050 నాటికి 83.6 మిలియన్లకు జీసీసీ జనాభా..!!
- బహ్రెయిన్ లో చైల్డ్ కేర్ కోసం కఠిన నిబంధనలు..!!
- నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు







