కువైట్ లోని లులు హైపర్ మార్కెట్లో ఇండియా ఉత్సవ్ వేడుకలు..!!

- January 25, 2026 , by Maagulf
కువైట్ లోని లులు హైపర్ మార్కెట్లో ఇండియా ఉత్సవ్ వేడుకలు..!!

కువైట్: లులు హైపర్ మార్కెట్  జనవరి 21 నుండి 27 వరకు కువైట్ లోని తన అవుట్లెట్లలో "ఇండియా ఉత్సవ్"తో భారత గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని జరుపుకుంది.  ఈ ఉత్సవాలను జనవరి 22న అల్-రాయ్ లోని లులు హైపర్ మార్కెట్ లో కువైట్ లోని భారత రాయబారి పరమిత త్రిపాఠి ప్రారంభించారు. ఈ  ఫెస్టివల్ సందర్భంగా భారతీయ బ్రాండెడ్ ఉత్పత్తులపై అద్భుతమైన తగ్గింపులు మరియు ప్రత్యేక ఆఫర్‌లను అందించారు.  

ఈ వేడుకలో కువైట్‌లోని 15 కంటే ఎక్కువ భారతీయ పాఠశాలలు పాల్గొన్న ఇండియన్ ఎత్నిక్ వేర్ ఫ్యాషన్ షో మరియు ఇండియన్ పేట్రియాటిక్ గ్రూప్ సాంగ్ కాంపిటీషన్ కూడా ఉన్నాయి. విజేతలకు గిఫ్ట్ వోచర్లు మరియు ట్రోఫీలను అందించారు.   లులు హైపర్ మార్కెట్ నిర్వహించిన “ఇండియా ఉత్సవ్” కువైట్‌లోని భారతీయ సమాజాన్ని విజయవంతంగా ఒకచోట చేర్చిందని.. భారతీయ వారసత్వం, సంస్కృతి మరియు సంప్రదాయాలను చాటిచెప్పిందని పేర్కొంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com