తైవాన్‌లోని అత్యంత ఎత్తైన భవనాన్ని అధిరోహించిన అమెరికన్ సాహసవీరుడు..!!
- January 25, 2026
తైపీ: ఒక అమెరికన్ పర్వతారోహకుడు ఆదివారం రోప్స్, ఎలాంటి భద్రతా పరికరాలు లేకుండా తైవాన్‌లోని అత్యంత ఎత్తైన భవనాన్ని అధిరోహించాడు. ఈ సాహసోపేతమైన ఘట్టాన్ని వందలాది మంది ప్రత్యక్ష్యంగా తిలకించారు. అలాగే, నెట్‌ఫ్లిక్స్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఆన్లైన్లో అనేక మంది చూశారు.
వివరాల్లోకి వెళితే.. 40 ఏళ్ల అలెక్స్ హొనాల్డ్ కు ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన కొండలను ఎక్కిన చరిత్ర ఉంది. 2017లో యోసెమిటీలోని "ఎల్ కాపిటన్"ను అధిరోహించడంతో పాపులర్ అయ్యాడు. తాజాగా తైవాన్ లోని 1,667 అడుగుల (508 మీటర్లు) ఎత్తులో ఉన్న తైపీ 101 భవనాన్ని ఒకటిన్నర గంట సమయంలో అధిరోహించి, మరోసారి వార్తల్లో నిలిచాడు.
అయితే, 2004లో "ఫ్రెంచ్ స్పైడర్‌మ్యాన్" అని పిలవబడే అలైన్ రాబర్ట్ ఈ ఎత్తైన భవనాన్ని అధిరోహించిన మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందారు.
తాజా వార్తలు
- తైవాన్‌లోని అత్యంత ఎత్తైన భవనాన్ని అధిరోహించిన అమెరికన్ సాహసవీరుడు..!!
- సౌదీ పోర్టుల్లో 965 ప్రొహిబిటేడ్ ఐటమ్స్ సీజ్..!!
- దుబాయ్‌లో ఆస్తి కొనుగోలు చేస్తున్నారా?
- కువైట్ లోని లులు హైపర్ మార్కెట్లో ఇండియా ఉత్సవ్ వేడుకలు..!!
- 2050 నాటికి 83.6 మిలియన్లకు జీసీసీ జనాభా..!!
- బహ్రెయిన్ లో చైల్డ్ కేర్ కోసం కఠిన నిబంధనలు..!!
- నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు







