RT77 మూవీ అనౌన్స్‌మెంట్, రేపు ఫస్ట్ లుక్ రిలీజ్

- January 25, 2026 , by Maagulf
RT77 మూవీ అనౌన్స్‌మెంట్, రేపు ఫస్ట్ లుక్ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ, యూనిక్ స్టొరీ టెల్లింగ్, అద్భతమైన కథలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శివ నిర్వాణతో చేతులు కలిపారు. #RT77 రవితేజ, శివ నిర్వాణ మధ్య ఫస్ట్ కొలాబరేషన్. ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ నిర్మాణ విలువలతో హ్యుజ్ కాన్వాస్‌పై నిర్మిస్తోంది. 

శివ నిర్వాణ పవర్ ఫుల్, యూనిక్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. రవితేజ ఇంతవరకు ఎప్పుడూ చేయని డిఫరెంట్ జానర్ మూవీ ఇది. కథలోని బలమైన ఎమోషన్‌, తన క్యారెక్టర్ ఆర్క్ కి ఇంప్రెస్ అయిన రవితేజ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకోసం ఆయన పూర్తిగా స్ట్రైకింగ్ మేకోవర్‌లో కనిపించబోతున్నారు.   
 
అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఆసక్తిని భారీగా పెంచింది. నైట్ స్కై బ్యాక్‌డ్రాప్‌లో ఓ పెద్ద చెట్టు, దానికి వేలాడుతున్న నల్లని దుస్తులు… ఈ విజువల్‌తో పాటు “His journey of redemption begins tomorrow” అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్, లోతైన భావోద్వేగాలతో కూడిన, ట్రాన్స్‌ఫార్మేటివ్ కథని ప్రజెంట్ చేస్తున్నాయి 

రవితేజ పుట్టినరోజు, గణతంత్ర దినోత్సవం సందర్భంగా చిత్ర నిర్మాతలు రేపు సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నారు.

నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మిస్తున్న #RT77కు టాప్ టెక్నికల్ టీం పని చేస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు. చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను నిర్మాతలు త్వరలో తెలియజేస్తారు. 

నటీనటులు: మాస్ మహారాజా రవితేజ

సాంకేతిక నిపుణులు:
రచన, దర్శకత్వం: శివ నిర్వాణ
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవి శంకర్
బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
పీఆర్ఓ: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్‌షో

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com