'విత్ లవ్' మూవీ ఫిబ్రవరి 6న తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్

- January 25, 2026 , by Maagulf
\'విత్ లవ్\' మూవీ ఫిబ్రవరి 6న తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్

అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ ప్రధాన పాత్రలలో నటించిన ఫీల్-గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'విత్ లవ్'. మదన్ రచన, దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని సౌందర్య రజనీకాంత్‌తో పాటు నజరత్ పసిలియన్, మహేష్ రాజ్ పసిలియన్ ఎంఆర్‌పి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మించారు. 'విత్ లవ్' చిత్రం ఫిబ్రవరి 6, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ సురేష్ ప్రొడక్షన్స్ నిర్వహిస్తోంది.  

'ఛాంపియన్' చిత్రంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని, ప్రజాదరణ పొందిన అనస్వర రాజన్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.

ఈ చిత్రం తెలుగు ఫస్ట్ సింగిల్ 'అయో కదలే' ఈరోజు విడుదలైంది. అద్బుతమైన మ్యూజిక్ తో ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది.

తమిళ బ్లాక్‌బస్టర్ 'టూరిస్ట్ ఫ్యామిలీ' భారీ విజయం తర్వాత దర్శకుడు అభిషన్ జీవింత్ ఈ రొమాంటిక్ డ్రామాతో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. 'లవర్' , 'టూరిస్ట్ ఫ్యామిలీ' వంటి చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన మదన్, ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

ఫీల్-గుడ్ కంటెంట్, సరికొత్త రొమాంటిక్ జోడీ, ప్రశంసలు పొందిన సాంకేతిక బృందంతో 'విత్ లవ్' ఈ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకుల మనసుని గెలుచుకోవడానికి సిద్ధమవుతోంది.

సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం: మదన్
నిర్మాతలు: సౌందర్య రజనీకాంత్, నజరత్ పసిలియన్, మహేష్ రాజ్ పసిలియన్
సినిమాటోగ్రఫీ: శ్రేయస్ కృష్ణ
సంగీతం: సీన్ రోల్డన్
ఎడిటింగ్: సురేష్ కుమార్
ఆర్ట్ డైరెక్టర్: రాజకమల్
కాస్ట్యూమ్ డిజైన్: ప్రియా రవి
అసోసియేట్ నిర్మాత: విజయ్ ఎం. పి.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎ. బాలమురుగన్
తెలుగు సాహిత్యం: సనరే
సౌండ్ మిక్సింగ్: సూరన్ జి
సౌండ్ డిజైన్: సూరన్ జి & ఎస్. అలగియాకూతన్
డిఐ: మ్యాంగో పోస్ట్
కలరిస్ట్: సురేష్ రవి
సిజి: రాజన్
డబ్బింగ్ స్టూడియో: సౌండ్స్ రైట్ స్టూడియో
తెలుగు సంభాషణలు & కంటెంట్ పర్యవేక్షణ – సతీష్ రెడ్డి మల్లిడి
తెలుగు మార్కెటింగ్: సౌత్‌బే
పిఆర్ఓ: వంశీ శేఖర్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com