శుభాంశు శుక్లాకు అశోక చక్ర ప్రదానం చేసిన రాష్ట్రపతి
- January 26, 2026
శుభాంశు శుక్లాకు అశోక చక్ర ప్రదానం చేసిన రాష్ట్రపతి
న్యూ ఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీ(Delhi)లో గణతంత్ర దినోత్సవ వేడుకలు అతి వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొని, దేశానికి విశేష సేవలు అందించిన వీరులకు ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందజేశారు.
అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాకు దేశంలో అత్యున్నత శౌర్య పురస్కారమైన ‘అశోక చక్ర’ను రాష్ట్రపతి ప్రదానం చేశారు. ఆయన సాధించిన ఘనత దేశానికి గర్వకారణంగా నిలిచింది. అలాగే భారతదేశ ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్ మానవ సహిత అంతరిక్ష యాత్రకు ఎంపికైన గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌కు ‘కీర్తి చక్ర’ పురస్కారం అందజేశారు. దేశ అంతరిక్ష రంగంలో ఆయన చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది.
తాజా వార్తలు
- శుభాంశు శుక్లాకు అశోక చక్ర ప్రదానం చేసిన రాష్ట్రపతి
- బహ్రెయిన్ లో కాస్మెటిక్ ప్రాక్టీషనర్లు అరెస్టు..!!
- ఒమాన్-సౌదీ 'విండ్స్ ఆఫ్ పీస్ 2026' ప్రారంభం..!!
- BHD–INR @244: భారతీయులకు ప్రయోజనం..!!
- రియాద్ లో కుప్పకూలిన స్ట్రీట్..!!
- కేపిటల్ గవర్నరేట్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ తరలింపు..!!
- యూఏఈ-ఇండియా రూట్లో ఫ్లైట్స్ కొరత..హై ఫెయిర్స్..!!
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్







