బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
- January 26, 2026
హైదరాబాద్: బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (BIACH&RI)లో భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవాన్ని అత్యంత గౌరవప్రదంగా, భావోద్వేగపూరితంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్వరపేటిక క్యాన్సర్ కారణంగా లారింజెక్టమీ శస్త్రచికిత్స పొందిన క్యాన్సర్ విజేతలు కలిసి జాతీయ గీతం **“జన గణ మన”**ను ఆలపించి ఒక చారిత్రాత్మక ఘట్టానికి నాంది పలికారు.
బంజారా హిల్స్‌లోని ఆసుపత్రి ప్రాంగణంలో నిర్వహించిన ఈ విశిష్ట కార్యక్రమంలో, లారింజెక్టమీ సర్వైవర్స్ ఎలక్ట్రోలారింక్స్ పరికరాలు మరియు ట్రాకియో–ఈసోఫేజియల్ వాయిస్ ప్రోస్తెసిస్ (TEP) సహాయంతో సమూహంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ అరుదైన, వినూత్న ప్రయత్నాన్ని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ అధికారికంగా ధృవీకరించి, లారింజెక్టమీ సర్వైవర్స్ ద్వారా నిర్వహించిన తొలి సామూహిక జాతీయ గీతాలాపనగా ప్రపంచ రికార్డుగా గుర్తించింది.
కార్యక్రమం జాతీయ పతాక ఆవిష్కరణతో ప్రారంభమై, అనంతరం లారింజెక్టమీ సర్వైవర్స్ గీతాలాపన కార్యక్రమం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ గారు —
శ్రీమతి నందమూరి బసవతారక రామారావు మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్ (NBTRMCF) చైర్మన్ & మేనేజింగ్ ట్రస్టీ మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ గౌరవ సభ్యులు, ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి బోర్డు సభ్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు,జె.ఎస్. ఆర్.ప్రసాద్ ,
సీఈఓ డాక్టర్ కృష్ణయ్య, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సుబ్రమణ్యేశ్వర రావు,చీఫ్–హెడ్ అండ్ నెక్ ఆంకాలజీ డాక్టర్ ఎల్.ఎం.చంద్రశేఖర రావు,సీనియర్ ఆంకాలజిస్టులు, వైద్య సిబ్బంది మరియు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రపంచ రికార్డు గీతాలాపన అనంతరం, లారింజెక్టమీ సర్వైవర్స్ **“వందే మాతరం”**ను ఆలపించి, భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో ఆ గీతానికి ఉన్న 150 ఏళ్ల విశిష్ట ప్రాధాన్యతను స్మరించుకున్నారు.అనంతరం ఆసుపత్రి యాజమాన్యం లారింజెక్టమీ సర్వైవర్స్‌ను ఘనంగా సత్కరించింది.
ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ,“సహజ స్వరాన్ని కోల్పోయినప్పటికీ అపారమైన ఆత్మవిశ్వాసంతో లారింజెక్టమీ సర్వైవర్స్ ప్రపంచ రికార్డు సాధించడం దేశానికి గర్వకారణం. ఇది ఆధునిక వైద్యం, పునరావాస చికిత్సలు సాధించిన విజయానికి నిలువెత్తు నిదర్శనం” అని అన్నారు.
ఈ కార్యక్రమం పై డాక్టర్ ఎల్.ఎం.చంద్రశేఖర రావు, చీఫ్–హెడ్ అండ్ నెక్ ఆంకాలజీ, BIACH&RI మాట్లాడుతూ,“టోటల్ లారింజెక్టమీ అనంతరం సమర్థవంతమైన స్పీచ్ థెరపీ, సహాయక పరికరాల సహాయంతో బాధితులు తిరిగి సంభాషణ సామర్థ్యాన్ని పొందగలుగుతారు. ఈ సామూహిక జాతీయ గీతాలాపన వారి ఆత్మగౌరవం, పునరుజ్జీవనం మరియు జీవితం పై గెలుపుకు ప్రతీక” అని తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఖతార్ ఆధ్వర్యంలో విజయవంతంగా ఉచిత వైద్య శిబిరం
- చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన..టీ20ల్లో సుజీ బేట్స్ రికార్డు బద్దలు
- యూకేలో సిక్కు బస్ డ్రైవర్ పై దాడి..గడ్డం పట్టుకుని లాగి..దారుణం..
- ఏషియన్ గేమ్స్‌లో భారత మహిళల హాకీ జట్టు ఘన విజయం
- ఒమన్‌లో 17 మంది ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- అబుదాబి సముద్ర జలాల్లో అరుదైన డాల్ఫిన్ల సందడి..!!
- నిర్మాణ రంగంపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ కీలక సిఫార్సులు..!!
- యుద్ధం ఆపాలంటే అమెరికాకు 7 షరతులు పెట్టిన ఇరాన్
- బహ్రెయిన్‌లో ‘వికసిత్ భారత్ రన్’..!!
- కువైట్‌లో 40 శాతానికి పైగా బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులు..!!







