ఖతార్‌లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!

- January 26, 2026 , by Maagulf
ఖతార్‌లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!

దోహా: ఖతార్ లో ప్రముఖ రిటైల్ కేంద్రమైన లులు హైపర్‌మార్కెట్ లో భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ‘ఇండియా ఉత్సవ్’ను ప్రారంభించింది. ఇది ఖతార్‌లోని తమ హైపర్‌మార్కెట్‌లన్నింటిలో ఫిబ్రవరి 2 వరకు కొనసాగుతుందని ప్రకటించారు. ఈ ఉత్సవాన్ని ఖతార్‌లోని భారత రాయబారి విపుల్, లులు గ్రూప్ గ్లోబల్ డైరెక్టర్ డాక్టర్ మొహమ్మద్ అల్తాఫ్ ప్రారంభించారు. 

ఈ వేడుకలో భాగంగా లులు హైపర్‌మార్కెట్‌లలో ఇండియాలోని వివిధ ప్రాంతాల నుండి సేకరించిన సేంద్రీయ, ప్రత్యేక వస్తువులతో సహా అనేక రకాల భారతీయ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com