దుబాయ్ లో ప్రపంచంలోనే మొట్టమొదటి గోల్డ్ స్ట్రీట్..!!
- January 28, 2026
యూఏఈ: దుబాయ్ ఎమిరేట్ గోల్డ్ డిస్ట్రిక్ట్ లో ప్రపంచంలోనే మొట్టమొదటి 'గోల్డ్ స్ట్రీట్'ను నిర్మించనున్నారు. ఇత్రా దుబాయ్ ఎమిరేట్ గోల్డ్ డిస్ట్రిక్ట్‌ను అధికారికంగా ప్రారంభించనుంది.
2024 నుండి 2025 వరకు యూఏఈ సుమారు $53.41 బిలియన్ల విలువైన బంగారాన్ని ఎగుమతి చేసింది. ప్రధాన వాణిజ్య భాగస్వాములలో స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్, ఇండియా, హాంకాంగ్ మరియు టర్కీ ఉన్నాయి. ప్రపంచంలో యూఏఈ రెండవ అతిపెద్ద ఫిజికల్ గోల్డ్ వాణిజ్య గమ్యస్థానంగా ఉంది.
దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్ లో పెర్ఫ్యూమ్, బ్యూటీ ప్రొడక్ట్స్, గోల్డ్, లైఫ్ స్టైల్ వంటి వివిధ రంగాలకు చెందిన ప్రముఖ బ్రాండ్ లకు చెందిన 1,000 కంటే ఎక్కువ రిటైలర్ దుకాణాలు రానున్నాయి. జవాహారా జ్యువెలరీ, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, అల్ రోమైజాన్ మరియు తనిష్క్ జ్యువెలరీ వంటి ఫ్లాగ్‌షిప్‌లతోపాటు జోయాలుక్కాస్ 24,000 చదరపు అడుగుల ఫ్లాగ్‌షిప్ కోసం ప్రణాళికలను ప్రకటించిందని, ఇది మిడిలీస్టులో అతిపెద్దది అని ఇత్రా దుబాయ్ CEO ఇస్సామ్ గలాదరి తెలిపారు.
తాజా వార్తలు
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం
- మహాత్ముడికి ప్రధాని మోడీ నివాళి







