కువైట్ లో ట్రాఫిక్ జరిమానాల పేరిట స్కామ్ మెసేజులు..!!
- January 28, 2026
కువైట్: కువైట్ లో ట్రాఫిక్ జరిమానాలను వెంటనే చెల్లించాలని స్కామ్ టెక్స్ట్ మెసేజులపై జాగ్రత్తగా ఉండాలని భద్రతా అధికారులు హెచ్చరించారు. వెంటనే జరిమానాలు చెల్లించకపోతే జరిమానాలు KD 20 నుండి KD 200 వరకు పెరుగుతాయని బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. లింక్ క్లిక్ చేయగానే బ్యాంకు డబ్బు మరియు వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తారని, ఇలాంటి ఫేక్ లింక్‌లను క్లిక్ చేయొద్దని సూచించారు. ట్రాఫిక్ ఉల్లంఘనల గురించి అంతర్గత మంత్రిత్వ శాఖ SMS లను పంపదని క్లారిటీ ఇచ్చారు. అన్ని విచారణలు మరియు చెల్లింపులు ప్రభుత్వ సాహిల్ అప్లికేషన్ లేదా అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే జరుగుతాయని తెలిపారు. అనుమానాస్పద మెసేజులు వస్తే వెంటనే అధికారులకు నివేదించాలని కోరారు.
తాజా వార్తలు
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం
- మహాత్ముడికి ప్రధాని మోడీ నివాళి







