200 మంది మహిళల ఒంటరి ప్రయాణానికి అనుమతి
- July 29, 2016
200 మంది సౌదీ మహిళలకు న్యాయస్థానం ఒంటరిగా ప్రయాణం చేసేందుకు అనుమతినిచ్చింది. వీరిలో కొందరు చదువులకోసం, కొందరు వైద్య చికిత్స కోసం, ఇంకొందరు పర్యాటకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. 350 మందికి పైగా సౌదీ మహిళలు ట్రావెల్ పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోగా, వారిలో కొందరిని న్యాయస్థానం తిరస్కరించింది. గార్డియన్స్, మాజీ భర్తల అభ్యంతరాలతో వారికి పర్మిషన్లు మంజూరు చేయలేదు న్యాయస్థానం. ఆర్టికల్ 8 ట్రావెల్ డాక్యుమెంట్స్ రెగ్యులేషన్స్ ప్రకారం, సౌదీ మహిళ, భర్త చనిపోయిన నేపథ్యంలో గార్డియన్‌తో పాటే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కాగా, న్యాయస్థానం అనుమతించిన మహిళలకు సంబంధించి ప్రయాణానికి గల కారణాల్ని వెల్లడించాల్సిందిగా కోరింది. ఇంకో వైపు మినిస్ట్రీ, ఎలక్ట్రానిక్ మ్యారేజ్ కాంట్రాక్ట్స్ సిస్టమ్‌ని వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకు రానుంది. ఈ విధానం ద్వారా నేషనల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కో-ఆర్డినేషన్‌తో పనిచేస్తుంది. ఫింగర్ ప్రింట్స్ ఈ విధానం ద్వారా తీసుకోబడతాయి గనుక వివాదాలకు ఆస్కారం తక్కువగా ఉంటుంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







