నేటి నుంచి కొత్త ఆధార్ యాప్ ఫుల్ వెర్షన్ అందుబాటులోకి..ప్రధాన ఫీచర్లు ఇవే..
- January 28, 2026
న్యూఢిల్లీ: ఆధార్ కార్డు మన రోజువారీ జీవితంలో అత్యంత కీలకంగా
మారింది. బ్యాంకింగ్ నుంచి ప్రభుత్వ సేవల వరకు ఆధార్ లేకుండా ఏ పనులు జరగడంలేదు. అయితే ఆధార్‌లో చిన్న మార్పు చేయాలన్నా ఇప్పటివరకు ఆధార్ సెంటర్ల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇకపై ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా UIDAI నేడు కొత్త ఆధార్ యాప్ ఫుల్ వెర్షన్ ను లాంచ్ చేయనుంది. ఈ కొత్త యాప్ విడుదలతో కోట్లాది మందికి పెద్ద ఊరట లభించనుంది.
ఈ కొత్త ఆధార్ యాప్ ఫుల్ వెర్షన్లో యూజర్ల సౌలభ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని అనేక ఆధునిక ఫీచర్లను చేర్చనున్నారు. ఈ యాప్ ద్వారా ఆధార్‌కు సంబంధించిన అనేక పనులను ఇంటి నుంచే సులభంగా పూర్తి చేయవచ్చు. ముఖ్యంగా ఆధార్ అప్డేట్స్ కోసం సెంటర్లకు వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ యాప్‌ను రూపొందించారు.
ఈ ఫుల్ వెర్షన్ యాప్ లో మొత్తం 5 కీలక ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా సిలెక్టివ్ షేర్ ఫీచర్ ద్వారా అవసరమైన సమాచారం మాత్రమే షేర్ చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల యూజర్ల ప్రైవసీ మరింత భద్రంగా ఉంటుంది. బయోమెట్రిక్స్ లాక్ ఫీచర్‌తో ఒక్క ట్యాబ్‌లో పూర్తి భద్రత లభిస్తుంది.
అలాగే మరో ఫీచర్ విషయానికి వస్తే.. ఫ్యామిలీ ప్రొఫైల్ ఫీచర్ ద్వారా ఒకే మొబైల్లో కుటుంబ సభ్యుల ఆధార్ ప్రొఫైల్స్ ను మ్యానేజ్ చేయవచ్చు. ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ ఫీచర్‌తో ఇంటర్నెట్ అవసరం లేకుండానే వ్యక్తి గుర్తింపును సురక్షితంగా వెరిఫై చేసుకోవచ్చు. ఇది ముఖ్యంగా ఇంట్లో అద్దెకు ఉండే వారి వివరాల పరిశీలనకు ఉపయోగపడనుంది. అలాగే ముఖ్యమైన ఫీచర్ మొబైల్ నంబర్ అప్డేట్ సౌకర్యాన్ని అందించనున్నారు. ఆధార్ ఫేస్ ఆథెంటికేషన్ ఉపయోగించి ఇంటి నుంచే మొబైల్ నంబర్‌ను సులభంగా అప్డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
కొత్త ఆధార్ యాప్ డౌన్లోడ్?
ఈ కొత్త ఆధార్ యాప్‌ను అధికారికంగా గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ యూజర్ ఇంటర్ఫేస్ చాలా సింపుల్‌గా ఉండటంతో తొలిసారి వాడే వారికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









