భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్‌షో..!!
- January 29, 2026
దోహా: ఇండియా ఐకానిక్ లగ్జరీ టూరిస్ట్ రైళ్లు అయిన మహారాజాస్ ఎక్స్‌ప్రెస్ మరియు గోల్డెన్ చారియట్లను ప్రోత్సహించడానికి జనవరి 27న భారతదేశ జాతీయ పర్యాటక దినోత్సవ వేడుకల్లో భాగంగా ఖతార్ లో రోడ్‌షోను నిర్వహించారు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మరియు ఇండియన్ బిజినెస్ & ప్రొఫెషనల్స్ కౌన్సిల్ (IBPC) సహకారంతో ఖతార్ లోని భారత రాయబార కార్యాలయం చేపట్టింది.
ఈ రోడ్‌షో సందర్భంగా భారత ప్రీమియం టూరిజం రైళ్ల గురించిన వివరాలను హైలైట్ చేశారు. ఈ లగ్జరీ రైళ్ల ప్రయాణాల ద్వారా భారత సాంస్కృతిక వారసత్వం, రాజ వారసత్వం మరియు ప్రపంచ స్థాయి ఆతిథ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ఖతార్‌లోని భారత రాయబారి విపుల్ వివరించారు. విలాసవంతమైన పర్యాటక గమ్యస్థానంగా భారత్ నిలుస్తుందని తెలిపారు. IRCTC గ్రూప్ జనరల్ మేనేజర్ ప్రోమిలా గుప్తా.. రెండు లగ్జరీ రైళ్ల ప్రయాణ ప్రణాళికలు, ఆన్‌బోర్డ్ సౌకర్యాలు, సేవలపై వివరణాత్మక ప్రజంటేషన్ ఇచ్చారు. రోడ్‌షోలో ప్రముఖ టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ మరియు టూరిజం నిపుణులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- విశాఖ జూ పార్క్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం
- హిమాచల్‌లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్‌షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!
- ఫుజైరాలో భారతీయ ప్రవాసుడు అనుమానస్పద మృతి..!!
- కువైట్‌లో 1.059 మిలియన్లకు పెరిగిన భారతీయ జనాభా..!!
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ గ్రాండ్ రిసెప్షన్ సక్సెస్..!!
- సిత్రాలో ప్రైవేట్ ఆస్తుల స్వాధీనానికి సిఫార్సు..!!
- తన రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన యువీ







