ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు!

- January 29, 2026 , by Maagulf
ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు!

భారత్‌లో ఇంటర్నెట్ వినియోగం రికార్డు స్థాయికి చేరుకుంది. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(IAMAI) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, 2025 నాటికి దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 95 కోట్లను దాటింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వినియోగం వేగంగా పెరగడం ఈ వృద్ధికి ప్రధాన కారణంగా నిలిచింది.

IAMAI, కాంతార్ కలిసి రూపొందించిన ‘ఇంటర్నెట్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2025’ ప్రకారం ప్రస్తుతం దేశంలో 95.8 కోట్ల యాక్టివ్ యూజర్లు ఉన్నారు. వీరిలో 57 శాతం మంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే కావడం విశేషం. పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లో ఇంటర్నెట్ వృద్ధి నాలుగు రెట్లు ఎక్కువగా ఉందని నివేదిక వెల్లడించింది.

డిజిటల్ వినియోగంలో ఏఐ పాత్ర కూడా వేగంగా (India internet users) పెరుగుతోంది. మొత్తం యూజర్లలో 44 శాతం మంది వాయిస్ సెర్చ్, చాట్‌బాట్లు, ఏఐ ఫిల్టర్లను వినియోగిస్తున్నట్లు తేలింది. అలాగే షార్ట్ వీడియోల వినియోగం విపరీతంగా పెరిగింది. దాదాపు 61 శాతం మంది యూజర్లు షార్ట్ వీడియోలను వీక్షిస్తున్నారని, ఇందులో గ్రామీణ వినియోగదారులే ముందున్నారని నివేదిక పేర్కొంది.

కర్ణాటక ఐటీ శాఖ కార్యదర్శి మంజుల ఎన్ సమక్షంలో జరిగిన ఇండియా డిజిటల్ సమ్మిట్‌లో ఈ నివేదికను విడుదల చేశారు. ఈ గణాంకాలతో ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న డిజిటల్ మార్కెట్లలో భారత్ ఒకటిగా నిలిచిందని నిపుణులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com