'ఫౌజీ' దసరాకి గ్రాండ్ గా రిలీజ్

- January 29, 2026 , by Maagulf
\'ఫౌజీ\' దసరాకి గ్రాండ్ గా రిలీజ్

రెబెల్ స్టార్ ప్రభాస్, క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్  'ఫౌజీ'. సక్సెస్ ఫుల్ పాన్-ఇండియా బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో టి-సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలై ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

దసరా పండుగ సందర్భంగా ‘ఫౌజీ’ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

షూటింగ్ పూర్తయ్యే వరకు ఎలాంటి విరామం లేకుండా కంటిన్యూ షెడ్యూల్ కొనసాగనుంది. ఈ సినిమా అత్యంత గ్రాండ్‌గా రూపుదిద్దుకుంటోంది. ‘ఫౌజీ’ విజువల్ వండర్ గా ఉండబోతోంది.

ఎమోషన్‌, గ్రాండ్యూర్‌కి పేరుపొందిన దర్శకుడు హను రాఘవపూడి, ప్రభాస్‌ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడని పవర్ ఫుల్ అవతార్ లో చూపించబోతున్నారు.

ప్రభాస్ సరసన హీరోయిన్‌గా ఇమాన్వీ నటిస్తోంది. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భాను చందర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ చిత్రాన్ని నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ లు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై వరల్డ్ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. సినిమాటోగ్రఫీని సుదీప్ చటర్జీ (ISC) నిర్వహిస్తుండగా, సంగీతాన్ని విషాల్ చంద్రశేఖర్ అందిస్తున్నారు. అనిల్ విలాస్ జాధవ్  ప్రొడక్షన్ డిజైనర్, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్.

ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో విడుదల కానుంది.

తారాగణం: ప్రభాస్, ఇమాన్వి, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద, భాను చందర్  

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: హను రాఘవపూడి
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
సహ నిర్మాత (T-సిరీస్) : శివ చనన
ప్రెసిడెంట్ (టి-సిరీస్) : నీరజ్ కళ్యాణ్
DOP: సుదీప్ ఛటర్జీ ISC
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
ప్రొడక్షన్ డిజైనర్: అనిల్ విలాస్ జాదవ్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
సాహిత్యం: కృష్ణకాంత్
కొరియోగ్రాఫర్: ప్రేమ్ రక్షిత్
కాస్ట్యూమ్ డిజైనర్లు: శీతల్ ఇక్బాల్ శర్మ, టి విజయ్ భాస్కర్
VFX: RC కమల కన్నన్
పబ్లిసిటీ డిజైనర్లు: అనిల్-భాను
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com