కువైట్-ఢిల్లీ ఫ్లైట్ కు బాంబు బెదిరింపు..!!

- January 31, 2026 , by Maagulf
కువైట్-ఢిల్లీ ఫ్లైట్ కు బాంబు బెదిరింపు..!!

కువైట్: కువైట్ నుండి ఢిల్లీకి వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు కాల్  వచ్చినట్లు సమాచారం అందింది. వెంటనే అధికారులు ఆ విమానాన్ని అహ్మదాబాద్‌కు మళ్లించారు. ఈ విమానం ఉదయం 6:40 గంటలకు సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 180 మంది ప్రయాణికులతో సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు పంపించి, భద్రతా సంస్థలు విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాయి.

విమానాశ్రయ అధికారుల ప్రకారం.. విమానంలో బాంబు ఉన్నట్లు పేర్కొంటూ ఒక ప్రయాణికుడికి చేతితో రాసిన నోట్ లభించడంతో, ముందుజాగ్రత్త చర్యగా విమానాన్ని మళ్లించారు. పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించారు.  అయితే, తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువు లభించలేదని అధికారులు తెలిపారు.

దీనిపై ఇండిగో సంస్థ స్పందించింది. భద్రతా ముప్పు కారణంగా విమానం 6E 1232ను మళ్లించినట్లు మరియు అన్ని ప్రామాణిక ప్రోటోకాల్‌లను పాటించినట్లు తెలిపింది. అవసరమైన తనిఖీల తర్వాత విమానానికి క్లియరెన్స్ లభించిందని, విమానం బయలుదేరి వెళ్లిందని ఎయిర్‌లైన్ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com