ఇరాన్ అధ్యక్షుడితో అమీర్ చర్చలు..!!
- January 31, 2026
దోహా: ఇరాన్ అధ్యక్షుడు హెచ్‌ఈ డాక్టర్ మసూద్ పెజెష్కియన్‌తో ఖతార్ అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ ఫోన్ కాల్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను, వివిధ రంగాలలో వాటిని బలోపేతం చేయడానికి గల మార్గాలను సమీక్షించారు. దీనితో పాటు తాజా ప్రాంతీయ మరియు అంతర్జాతీయ పరిణామాలపై, ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితిపై తమ ఆలోచనలను షేర్ చేసుకున్నారు.
ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించి, స్థిరత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో జరుగుతున్న ప్రయత్నాలపై చర్చించారు. ప్రాంతీయ సమస్యలను శాంతి మరియు భద్రతను పటిష్టం చేసే విధంగా, ప్రాంత ప్రయోజనాలకు తోడ్పడే రీతిలో దౌత్య ప్రయత్నాల ప్రాముఖ్యతను ఇరుపక్షాలు గుర్తించాయని, త్వరలోనే దీనిపై అధికారిక స్పందన వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం
- మహాత్ముడికి ప్రధాని మోడీ నివాళి







