అల్ హదీథా బార్డర్ వద్ద స్మగ్లింగ్ గుట్టురట్టు..!!
- January 31, 2026
రియాద్: సౌదీ అరేబియా జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీ (ZATCA) భారీ స్మగ్లింగ్ ప్రయత్నాన్ని భగ్నం చేసింది. ఒక ఫుడ్ పార్సిల్ లో దాచిన 269,411 క్యాప్టగాన్ పిల్స్ ను అల్ హదీథా బార్డర్ వద్ద అడ్డుకున్నారు. అలాగే, ఆంఫెటమైన్ ఆధారిత క్యాప్టగాన్ అనే డ్రగ్ పిల్స్ ను నెయ్యి డబ్బాలలో దాచి తరలిస్తున్నట్లు ZATCA ప్రతినిధి హమ్మూద్ అల్-హర్బీ తెలిపారు. అనంతరం వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అల్-హర్బీ వెల్లడించారు.
అనుమానాస్పద కార్యకలాపాల గురించి ప్రత్యేక భద్రతా హాట్‌లైన్ 1910, ఇమెయిల్ చిరునామా [email protected], లేదా అంతర్జాతీయ నంబర్ 009661910 ద్వారా నివేదించడం ద్వారా స్మగ్లింగ్ నిరోధక ప్రయత్నాలను అడ్డుకునేందుకు సహకరించాలని అల్-హర్బీ ప్రజలను కోరారు. కచ్చితమైన సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా పెడతామని, ఆర్థిక బహుమతి అందజేస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- 2026: అట్టహాసంగా ముగిసిన వింగ్స్ ఇండియా 2026
- అజ్మాన్ 'అబ్రా'కు పెరిగిన క్రేజ్
- రేపు సిట్ ముందుకు కేసీఆర్..
- యూఏఈ సరికొత్త చట్టం
- ఇజ్రాయెల్‌తో ట్రంప్ రాజీ..
- చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్
- ఇరాన్ అధ్యక్షుడితో అమీర్ చర్చలు..!!
- అల్ హదీథా బార్డర్ వద్ద స్మగ్లింగ్ గుట్టురట్టు..!!
- యూఏఈలో ఫిబ్రవరి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!
- కువైట్-ఢిల్లీ ఫ్లైట్ కు బాంబు బెదిరింపు..!!







