ఏపీలో కొత్తగా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం..
- February 01, 2026
అమరావతి: అమరావతిలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. హైకోర్టు, సెక్రటేరియట్, అధికారుల క్వార్టర్స్, రోడ్లు సహా అన్ని పనులు ఊపందుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు.. పనులపై ఆరా తీస్తున్నారు. తాజాగా అమరావతి ప్రాంతలో ఉన్న ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంపై ఏపీ మున్సిపల్‌శాఖ అప్డేట్ ఇచ్చింది.
'రాజధాని అమరావతిలో నవులూరు వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ACA ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పనులు దాదాపు 90శాతం పూర్తయ్యాయి. అమరావతిలో అత్యాధునిక సౌకర్యాలతో, అంతర్జాతీయ ప్రమాణాలతో ACA ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మాణం' అంటూ వీడియోను ట్వీట్ చేశారు. '24 ఎకరాల్లో, 34 వేల సీటింగ్ కెపాసిటీతో, గుంటూరుకు 16 కిలోమీటర్ల దూరంలో, విజయవాడకు 13 కిలో మీటర్ల దూరంలో' ఉందని తెలిపారు. ఈ స్టేడియం పనులు 90శాతం పూర్తయ్యాయని.. త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సమీపంలో అత్యాధునిక సౌకర్యాలతో ఈ క్రికెట్ స్టేడియం ఉంది. వాస్తవానికి 2014-2019లో అప్పటి టీడీపీ ప్రభుత్వం అమరావతిలోని నవులూరులో ఈ స్టేడియం నిర్మాణం చేపట్టింది. కానీ గత ప్రభుత్వ హయాంలో ఈ స్టేడియం పనులు ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ పనులు చేపట్టారు. మొత్తం రూ.110 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేశారు. ఇండోర్ నెట్స్ ఉన్నాయి.. వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా.. గంటలోపే మళ్లీ మ్యాచ్ నిర్వహించేలా లేటెస్ట్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేశారు. 34 వేల మంది కూర్చునేలా గ్యాలరీలు ప్లాన్ చేసినా.. సీటింగ్ ఏర్పాటు పనులు ఆగిపోయాయి.
స్టేడియానికి సంబంధించిన ఫ్లడ్ లైట్లు, సెంట్రలైజ్ ఏసీ పనులు ఆగిపోయాయి.. స్టేడియంకు రంగులు, ర్యాంపులపై టైల్స్, ఎలక్ట్రిక్ పనులు, స్టేడియం బయట డ్రైనేజీ పనులు, స్టేడియం చుట్టూ ప్రహరీ నిర్మాణం పనులు ఆగిపోయాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ పనులు చేపట్టారు. మిగిలిన పనుల్ని కూడా త్వరగా పూర్తి చేసి త్వరలోనే స్టేడియాన్ని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. రంజీతో పాటుగా అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఏపీలో ప్రస్తుతానికి విశాఖపట్నంలో మాతమ్రే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉంది.. అమరావతిలోని ఈ స్టేడియం పనులు పూర్తిచేసి ఇంటర్నేషనల్ స్థాయికి తీర్చిదిద్దాలనుకుంటున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం







