ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్!

- February 01, 2026 , by Maagulf
ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్!

క్రెడిట్ కార్డుల వినియోగం పై బ్యాంకులు క్రమంగా కఠిన వైఖరి అవలంబిస్తున్నాయి.డిజిటల్ పేమెంట్లు, వినోదం,రవాణా, ఆన్‌లైన్ గేమింగ్ వంటి విభాగాల్లో పెరుగుతున్న ఖర్చులు, రిస్క్‌ను దృష్టిలో పెట్టుకుని ఫిబ్రవరి 1, 2026 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.ఈ మార్పులు లక్షలాది క్రెడిట్ కార్డ్ వినియోగదారుల జేబుపై నేరుగా ప్రభావం చూపనున్నాయి. అయితే అన్ని బెనిఫిట్స్‌ను రద్దు చేయడం లేదు. కొన్ని కీలక సౌకర్యాలు యథాతథంగా కొనసాగనున్నాయి.ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై అందిస్తున్న కాంప్లిమెంటరీ మూవీ టికెట్ బెనిఫిట్స్‌ను నిలిపివేస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. ఇప్పటి వరకు బుక్‌మైషో ద్వారా ఫ్రీగా లేదా డిస్కౌంట్‌తో సినిమా టిక్కెట్లు పొందిన యూజర్లకు ఇకపై ఈ సౌకర్యం అందుబాటులో ఉండదు. ముఖ్యంగా ICICI Instant Platinum Chip Credit Card వంటి కార్డులపై ఈ ఫీచర్‌ను పూర్తిగా తొలగించనున్నారు.

  • Credit Card రివార్డ్ పాయింట్లకు కోత :క్యాబ్‌లు, మెట్రో, రైల్వే తదితర రవాణా సేవలకు క్రెడిట్ కార్డును ఉపయోగించే వారికి కొత్త పరిమితులు విధించారు. రూబిక్స్, సఫిరో, ఎమరాల్డ్ వంటి ప్రీమియం కార్డులపై నెలకు గరిష్టంగా రూ. 20 వేల వరకు చేసిన ఖర్చుకే రివార్డ్ పాయింట్లు లభిస్తాయి. ఇతర కార్డులపై ఈ పరిమితిని రూ. 10 వేలుగా నిర్ణయించారు. ఈ పరిమితిని మించి ఖర్చు చేసినా అదనపు రివార్డ్ పాయింట్లు మాత్రం ఇవ్వరు.
  • ఇన్సూరెన్స్ చెల్లింపులపై ఊరట : అయితే ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపుల విషయంలో మాత్రం యూజర్లకు కొంత ఊరట లభించింది. ICICI HPCL Super Saver Credit Card వినియోగదారులు గతంలో మాదిరిగానే రూ. 40 వేల వరకు బీమా ప్రీమియం చెల్లింపులపై రివార్డ్ పాయింట్లు పొందవచ్చు. ఈ విభాగంలో ఎలాంటి కోత విధించలేదు.
  • ఆన్‌లైన్ గేమింగ్‌పై భారీ ఛార్జీలు : డ్రీమ్11, MPL, రమ్మీ కల్చర్ వంటి ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు క్రెడిట్ కార్డు ద్వారా డబ్బు జమ చేస్తే ఇకపై అదనపు భారం పడనుంది. జనవరి 15, 2026 నుంచి ప్రతి గేమింగ్ లావాదేవీపై 2 శాతం ఛార్జీ వసూలు చేయనున్నారు. భవిష్యత్తులో మరిన్ని గేమింగ్ యాప్‌లను కూడా ఈ జాబితాలో చేర్చే అవకాశం ఉంది.అలాగే క్రెడిట్ కార్డు ద్వారా పేటీఎం, ఫోన్‌పే, అమెజాన్ పే, మొబిక్విక్, ఫ్రీఛార్జ్, ఓలామనీ వంటి వాలెట్లలో డబ్బు లోడ్ చేస్తే అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. రూ. 5 వేలకుపైగా వాలెట్ రీఛార్జ్ చేస్తే 1 శాతం ఛార్జీ వర్తిస్తుంది.ట్రాన్స్‌పోర్ట్ విభాగంలో ఒక కస్టమర్ నెలలో రూ. 50 వేలకుపైగా ఖర్చు చేస్తే, ఆ అదనపు మొత్తంపై 1 శాతం ఛార్జీ విధించనున్నారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com