10 తర్వాత పూర్తి స్థాయిలో ఇండిగో విమానాల కార్యాచరణ
- February 03, 2026
రాజంపేట: ఈనెల 10 తర్వాత మినహాయింపులు లేకుండా కార్యాచరణ అవసరాలను తీర్చడానికి తగినంత పైలట్లు, సిబ్బంది ఉంటారని ఇండిగో అధికారి కంగా డైరెక్టరేట్ జనరల్ అఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ)కి హామీ ఇచ్చింది. తాత్కాలిక సడలింపులు ముగిసిన తర్వాత కార్యాచరణ స్థిరత్వాన్ని కొనసాగించాలని ఆదేశించినట్లు పౌర విమాన “యాన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి మొహుల్ మురళీధర్ పేర్కొన్నారు. పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సందర్భంగా రాజ్యసభ సభ్యులు ఎంపీ మేడా రఘునాథరెడ్డి ఇండిగో సంస్థ ఎదుర్కొంటున్న విమాన అంతరాయాలపై డైరెక్టరేట్ జనరల్ అఫ్ సివిల్ ఏవియేషన్ తన విచారణను పూర్తి చేసిందా అని ప్రశ్నించారు. అంతేకాకుండా ఏ మేరకు చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.
అందుకు మంత్రి లిఖిత పూర్వక సమాధానంలో గత ఏడాది డిసెంబర్ 3, 5 మధ్య ఇండిగో చేసిన పెద్ద ఎత్తున జాప్యాలు, సర్వీసుల రద్దుల కారణంగా, 1937 ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ లోని 133తి నిబంధన కింద ఆదేశాలను పాటించనందుకు 22.20 కోట్ల ఒకేసారి ఆర్థిక జరిమానా విధించినట్టు తెలిపారు. దీర్ఘకాలిక దిద్దుబాటు చర్యలను నిర్ధారించడానికి డీజీసీఏ రూ.50 కోట్ల బ్యాంక్ గ్యారెంటీని అందించాలని ఇండిగోను ఆదేశించామన్నారు. పరిహారం చెల్లింపు ప్రక్రియ కూడా జరిగినట్టు తెలిపారు. బాధిత ప్రయాణీకులకు వాపసు, పరిహార మొత్తాలను సకాలంలో చెల్లించడానికి వీలుగా ఆన్లైన్ ట్రావెల్ ఏజెంట్లు పనిచేస్తాయన్నారు.
విమాన రాకపోకలు, ప్రయాణీకుల డిమాండ్ పెరుగుదల నుండి ఉత్పన్నమయ్యే అవసరాలను తీర్చడానికి, గరిష్ట సమయాల్లో విమాన రాకపోకలను బలోపేతం చేయడానికి, కొత్త విమానాశ్రయాల అభివృద్ధి, ఇప్పటికే ఉన్న విమానాశ్రయ మౌలిక సదుపాయాల విస్తరణ, మార్పు, అప్గ్రేడ్లు ఎప్పటికప్పుడు చేస్తున్నట్లు తెలిపారు. వీటిలో కొత్త టెర్మినళ్ల నిర్మాణం, ఉన్న టెర్మినళ్ల విస్తరణ, ఆధునీకరణ, రన్వేలు, ఆప్రాన్లను బలోపేతం చేయడం జరుగుతుందన్నారు. భూమి లభ్యత, సాంకేతికఆర్థిక సాధ్యాసాధ్యాలు, ఆర్థిక వనరుల లభ్యత, సమర్థ నియంత్రణ అధికారుల నుండి అవసరమైన అనుమతులు వంటి అంశాలకు లోబడి, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో సహా సంబంధిత విమానాశ్రయ నిర్వాహకులు, డెవలపర్లు అభివృద్ధి పనులను చేపడతారు మంత్రి సమాధానమిచ్చారు.
తాజా వార్తలు
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి
- యూఏఈలో పిల్లలకు ఫ్లూ హెచ్చరికలు.. స్కూల్‌కు పంపొద్దని సూచన..!!
- కార్మికుల రిక్రూట్మెంట్ పై వార్న్..SR100,000 వరకు ఫైన్..!!
- ఒమన్‌లో సరికొత్త వ్యవసాయ పరిశోధనలు..!!







