ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- August 06, 2026
హైదరాబాద్: తెలంగాణ సిద్ధాంతకర్త, రాష్ట్ర ఆవిర్భావ ఉద్యమానికి మార్గదర్శకుడైన ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా డీజీపీ సి.వి.ఆనంద్ నివాళులర్పించారు. పలు ప్రముఖులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా డీజీపీ సి.వి.ఆనంద్ మాట్లాడుతూ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చూపిన దూరదృష్టి, అచంచలమైన నిబద్ధత తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఆయన అందించిన మేధోపరమైన మార్గనిర్దేశం, ఉద్యమానికి ఇచ్చిన బలమైన పునాది ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ తెలంగాణ అభివృద్ధికి కృషి చేయడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ కు అమెరికా మరో వార్నింగ్
- సౌదీలో భవన నిర్మాణ రంగం దూకుడు..!!
- ఇరాన్ దాడులకు మద్దతు కేసు..నిందితులకు షాకిచ్చిన కాసేషన్ కోర్టు..!!
- దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు మంచిరోజులు వస్తాయి..భారత్‌లో పెట్టుబడులపై ఆసక్తి..!!
- కువైట్‌లో మండుతున్న ఎండలు.. ముగిసిన మిడ్ డే వర్క్ నిషేధం..!!
- రిమాల్ అల్ షర్కియాహ్ పర్యాటక ప్రాంత అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్..!!
- ‘ది న్యూయార్కర్’ కథనంపై తీవ్రంగా స్పందించిన ఖతార్..!!
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా







