స్కూల్ పిల్లలకు ఉచితంగా ఆధార్ క్యాంపులు
- February 04, 2026
ఆంధ్రప్రదేశ్‌లో (AP) స్కూల్, కాలేజీ విద్యార్థులకు ప్రభుత్వం మరోసారి తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా మరోసారి స్కూల్స్, ఇంటర్ కాలేజీల్లో ఆధార్ (Aadhaar) స్పెషల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. గతేడాది నుంచి ఈ క్యాంపులు నిర్వహిస్తున్నా సరే చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లల ఆధార్ కార్డులో వివరాలను అప్డేట్ చేయలేదు. ఈ క్రమంలో ప్రభుత్వం మరోసారి క్యాంపులు నిర్వహిస్తోంది. ఈ నెల 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ ఆధార్ క్యాంపుల్ని స్కూల్స్, కాలేజీల్లో నిర్వహిస్తున్నారు. రెండో విడతగా ఈ నెల 16వ తేదీ నుంచి 20 తేదీ వరకు కూడా మరోసారి అవకాశం కల్పించారు.
ఈ ఆధార్ స్పెషల్ క్యాంపుల్ని నిర్వహిస్తున్నారు. (AP) ఐదేళ్ల నుంచి 17 ఏళ్ల వరకు పిల్లలకు ఆధార్ కార్డు తీసుకున్న తర్వాత మొదటిసారి బయోమెట్రిక్ అప్డేట్ చేస్తే ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు.. పూర్తిగా ఉచితం. పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, మిగిలిన మార్పులు/చేర్పులకు కేంద్రం నిర్ణయించిన నామమాత్రంగా ఫీజులు వసూలు చేస్తారు.
గతేడాది అక్టోబర్ నుంచి ఈ స్పెషల్ ఆధార్ క్యాంపుల్ని నిర్వహిస్తోంది. ప్రతి నెలలో రెండు విడతలుగా క్యాంపులు ఏర్పాటు చేసినా సరే చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లల ఆధార్ కార్డుల్ని అప్డేట్ చేయడం లేదు అందుకే ప్రభుత్వం మరో ఛాన్స్ ఇచ్చింది. ఒకవేళ ఆధార్ కార్డు వివరాలు అప్డేట్ చేసుకోకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి అంటున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ రాజధాని దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటన
- ఖతార్ లో క్లాస్రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!
- బహ్రెయిన్ లో రమదాన్ మద్దతుకు ఎంపీల ప్రతిపాదన..!!
- కువైట్ లో స్మార్ట్ ఎలక్ట్రానిక్ మానిటరింగ్ సిస్టం అమలు..!!
- రుస్తాక్ వింటర్ ఫెస్టివల్ 2026 ప్రారంభం..!!
- ద్వైపాక్షిక సంబంధాలు.. సౌదీ క్రౌన్ ప్రిన్స్, పుతిన్ చర్చలు..!!
- రమదాన్ కంటే ముందే పరీక్షల షెడ్యూల్ సర్దుబాటు..!!
- స్కూల్ పిల్లలకు ఉచితంగా ఆధార్ క్యాంపులు
- ముంచెత్తిన తీవ్ర హిమపాతం..35 మంది మృతి
- భారత్లో గూగుల్ మెగా ప్లాన్..20 వేల ఉద్యోగాలు రెడీ







