ముంచెత్తిన తీవ్ర హిమపాతం..35 మంది మృతి
- February 04, 2026
జపాన్: జపాన్ లోని అనేక ప్రాంతాల్లో భారీ హిమపాతం నిండిపోయింది. పలు ప్రాంతాలను హిమపాతం ముంచెత్తింది. గత రెండు వారాలుగా ఉత్తర జపాన్ లో విపరీతంగా మంచు కురుస్తోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ మంచు కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 35 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. సుమారు 300 మందికి పైగా గాయాలపాలయ్యారని వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లోనైతే ఏకంగా 72 అంగుళాల మేర మంచు పేరుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు. అతిశీతల వాతావరణం కారణంగా చలి తీవ్రత పెరిగి గుండెపోటు మరణాలు అధికసంఖ్యలో నమోదవుతున్నాయన్నాయని తెలిపారు.
ఈ విషయమై జపాన్ ప్రభుత్వ ప్రధాన ప్రతినిధి మాట్లాడుతూ.. భారీగా మంచు పేరుకుపోవడంతో దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థతో పాటు ఇతర ప్రజాసేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని తెలిపారు. పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడుతుండడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంచును తొలగించడానికి టాస్క్ ఫోర్స్ బృందాలను నియమించామన్నారు. ఇంత అధికంగా మంచు కురవడం గత 40 ఏళ్లలో ఇదే మొదటిసారని.. రానున్న రోజుల్లో హిమపాతం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







