రమదాన్ కంటే ముందే పరీక్షల షెడ్యూల్‌ సర్దుబాటు..!!

- February 04, 2026 , by Maagulf
రమదాన్ కంటే ముందే పరీక్షల షెడ్యూల్‌ సర్దుబాటు..!!

యూఏఈ: పవిత్ర రమదాన్ మాసం సమీపిస్తున్న నేపథ్యంలో పాస్టింగ్ కు అనుగుణంగా ఎగ్జామ్ షెడ్యూల్ ను స్కూల్స్ మేనేజ్ మెంట్లు ప్లాన్  చేస్తున్నాయి.  అయితే, కొన్ని అంతర్గత ఇవాల్యుయేషన్ మరియు బోర్డు పరీక్షలు ఇప్పటికీ పాస్టింగ్ టైమింగ్స్ ను దృష్టిలో పెట్టుకొని షెడ్యూల్ చేశారు.  ఫిబ్రవరి 17 నుండి ప్రారంభమయ్యే CBSE బోర్డు పరీక్షలు మరియు ఫిబ్రవరి 12, 17 తేదీలలో జరగనున్న ISC/ICSE పరీక్షలతో రమదాన్ ఒవర్ లాప్ అవుతుందని భావిస్తున్నారు.  

రమదాన్ మాసంలో పాస్టింగ్ నేపథ్యంలో పరీక్షా సమయాలు, పేపర్ల మధ్య గ్యాప్ ఇవ్వడం ద్వారా ఒత్తిడిని తగ్గించేలా ప్లాన్ చేస్తామని క్రెడెన్స్ హై స్కూల్ CEO-ప్రిన్సిపాల్ దీపికా థాపర్ సింగ్ తెలిపారు. ఈ విషయాన్ని ముందుగానే తెలియజేస్తారని పేర్కొన్నారు.     

రమదాన్ సమయంలో తాము విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఇంటర్నల్ పరీక్షలను ప్లాన్ చేస్తామని GEMS అల్ బర్షా నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్/CEO మిచెల్ థామస్ తెలిపారు.  ఎగ్జామ్ ఫార్మాట్ తేలికగా ఉండేలా వారి సామర్థ్యాలను ప్రదర్శించేలా షెడ్యూల్ ఉంటుందని పేర్కొన్నారు.  ముందుగానే పేరెంట్స్ సర్క్యులర్‌లు లేదా ఇమెయిల్‌లను స్కూల్ మేనేజ్ మెంట్ పంపుతుందని అన్నారు.   

అమెరికన్ అకాడమీ ఫర్ గర్ల్స్ ప్రిన్సిపాల్ లిసా జాన్సన్ మాట్లాడుతూ.. రమదాన్ సందర్భంగా తన పాఠశాల అదనపు లెర్నింగ్ మద్దతును అందిస్తుందని చెప్పారు. విద్యార్థుల శ్రేయస్సుకు తోడ్పడటానికి, రంజాన్ సమయంలో ప్రధాన అంతర్గత పరీక్షలు రాకుండా ఉద్దేశపూర్వకంగా తమ విద్యా క్యాలెండర్‌ను రూపొందిస్తామని తెలిపారు. అదనంగా, విద్యార్థులు ఉపవాసం విరమించిన తర్వాత, వారు మరింత సౌకర్యవంతంగా మరియు హైడ్రేటెడ్‌గా ఉన్నప్పుడు ఇంట్లో పాఠాలను సమీక్షించగలిగేలా తాము రికార్డ్ చేసిన లెర్నింగ్ వీడియోలను అందిస్తామని పేర్కొన్నారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com