బహ్రెయిన్ లో రమదాన్ మద్దతుకు ఎంపీల ప్రతిపాదన..!!

- February 04, 2026 , by Maagulf
బహ్రెయిన్ లో రమదాన్ మద్దతుకు ఎంపీల ప్రతిపాదన..!!

మనామా: బహ్రెయిన్ లో రమదాన్ మాసం నేపథ్యంలో ప్రజలకు మద్దతుగా కొన్ని చర్యలు తీసుకోవాలని ఎంపీలు ప్రతిపాదించారు. ముఖ్యంగా డిజిటల్ ఫుడ్ వోచర్లు, షాప్ డిస్కౌంట్లు మరియు ఎంపిక చేసిన ప్రభుత్వ ఛార్జీలపై ఒక నెల విరామం ఇవ్వాలని కోరుతూ, తద్వారా లో మరియు మిడిల్ క్లాస్ కుటుంబాలకు రమదాన్ మద్దతును అందివ్వాలని పార్లమెంటులో అత్యవసర ప్రతిపాదనగా ఉంచారు. ఎంపీలు మునీర్ సెరూర్, హనన్ ఫర్దాన్, లుల్వా అల్ రుమైహి, నజీబ్ అల్ కవారీ మరియు అహ్మద్ సల్మాన్ అల్ అహ్మద్ ఈ ప్రతిపాదనను సమర్పించారు.

ఫుడ్, సామాజిక విధులు మరియు రోజువారీ అవసరాలపై ఖర్చు పెరుగుతున్నందున ప్రతి రమదాన్ లో ఇంటి బిల్లులు పెరుగుతాయని, జీతం అలాగే ఉంటుందని మరియు సాధారణ నెలవారీ చెల్లింపులు ఇప్పటికీ చెల్లించాల్సి ఉంటుందని ఎంపీలు వాదించారు.  అర్హత కలిగిన కుటుంబాలు ఈ నెలలో ప్రధాన ఆహార షాపింగ్‌లో ఉపయోగించుకోవడానికి అవసరమైన వస్తువుల కోసం డిజిటల్ రంజాన్ వోచర్‌లను అందివ్వాలని కోరారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com